హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది.సునీల్ బన్సల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ వంద రోజుల యాక్షన్ ప్లాన్ పై చర్చించారు.
ఈ క్రమంలో ఎజెండాతో పాటు కార్యాచరణను బీజేపీ రేపు ప్రకటించనుంది.కాగా పెండింగ్ యాక్టివిటీ పూర్తి చేయాలని సునీల్ బన్సల్ సూచించారు.
ఈ నేపథ్యంలోనే అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ప్రముఖులను కలవడంపై నేతలు స్పీడ్ పెంచనున్నారు.ఆగస్ట్ 15 లోగా అన్ని పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది టీడీపీ.
అనంతరం రేపు జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, తదితరులతో సమావేశం కానున్నారని సమాచారం.







