చాలా మంది హీరోల సినిమాలు హిట్ టాక్ వచ్చిన కూడా సరైన కలెక్షన్స్ రావు కానీ కొంతమంది హీరోల సినిమాలు మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చినా లాస్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.కొన్నిసార్లు ఫ్లాప్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబట్టి కమర్షియల్ గా హిట్ కూడా అయిపోతుంటారు.
స్టార్ హీరోలకు ఉన్న ఇమేజ్ అలాంటిది మరి.ఇందుకు రీసెంట్ గా విడుదలైన ప్రభాస్ `ఆదిపురుష్( Adipurush )` నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

తొలి ఆట నుంచే ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చింది.ఎన్నో విమర్శలు, మరెన్నో ట్రోల్స్ ఆదిపురుష్‌పై జరిగాయి.కానీ, ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా ఎవరూ ఊహించని రీతిలో వసూళ్లను సొంతం చేసుకుంది.అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనూ కొన్ని సినిమాలు ఫ్లాప్ టాక్ తోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.మరి ఈ సినిమాలు ఏవేవో ఓ లుక్కేసేయండి…
తొలి ఆట నుంచే ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చింది.
ఎన్నో విమర్శలు, మరెన్నో ట్రోల్స్ ఆదిపురుష్‌పై జరిగాయి.కానీ, ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా ఎవరూ ఊహించని రీతిలో వసూళ్లను సొంతం చేసుకుంది.అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనూ కొన్ని సినిమాలు ఫ్లాప్ టాక్ తోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.మరి ఈ సినిమాలు ఏవేవో ఓ లుక్కేసేయండి…
పవన్ కళ్యాణ్, శ్రతి హాసన్ జంటగా నటించిన చిత్రాల్లో `కాటమరాయుడు`( Katamarayudu ) ఒకటి.కిషోర్ కుమార్ పార్థాసాని ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
కమల్ కామరాజు, ఆలీ, ప్రదీప్ రావత్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించగా.అనూప్ రూబెన్స్ స్వరాలు అందించాడు.
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం 2017లో విడుదలై ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది.అయినా కూడా ఫుల్ రన్ లో మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్, రూ.62 కోట్ల రేంజ్ లో షేర్ ను దక్కించుకుంది.

అలాగే పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ను ఫ్యాన్స్ ఎంతగానో ఇష్టపడతారు.వీరిద్దరి కలయికలో వచ్చిన అత్తారింటికి దారేది, ( Attarintiki Daredi )జల్సా సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.వీరి హ్యాట్రిక్ మూవీ `అజ్ఞాతవాసి`.( Agnyaathavaasi ) ఇందులో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు.2018లో రిలీజ్ అయినా ఈ సినిమా టాక్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయినా కూడా పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రం దాదాపుగా రూ.100 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది…నిజంగా ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి ఎందుకంటే ప్లాప్ టాక్ తో కూడా 100 కోట్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు…
.







