పైసా ఇవ్వనిదే పని కాదు.మీరు ఏదైనా సేవ కార్యక్రమం చేస్తున్న లేదా, చారిటీ ప్రోగ్రాం పెట్టిన ఒక ప్రముఖ వ్యక్తి ఉంటె ఆ ప్రోగ్రాం కి మంచి కవరేజ్ దక్కుతుంది కాబట్టి సినిమా సెలెబ్రిటీలను పిలవడం చాల రోజులుగా పరిపాటి అయిపోయింది.
ఇప్పుడు అంటే చాల పి ఆర్ ఏజెన్సీ లు( PR agencies ) వచ్చాయి కానీ ఒకప్పుడు ఆలా ఉండేది కాదు.ఉదాహరణకు చిరంజీవి( Chiranjeevi ) గురించి చెప్పాలంటే ఆయనను గతం లో ఒక 15 ఏళ్ళ క్రితం రాజకీయ పార్టీ పెట్టక ముందు ఒక సేవ సంస్థ తమ కార్యక్రమానికి అతిధి గా ఆహ్వానించడానికి వెళ్లారట.
వారిని చుసిన వెంటనే అయన మొహం ఒకలా పెట్టి వెళ్లి మా అల్లు అరవింద్( Allu Arvind ) ని కలవండి అని చెప్పాడట.
సరే అని అల్లు అరవింద్ ని కలిస్తే 20 లక్షలు ఇస్తే చిరంజీవి డేట్ ఇస్తాను.ఫంక్షన్ ఏ రోజు పెట్టుకుంటారో మా మేనేజర్ కి చెప్పండి అంటూ వెళ్ళిపోయాడట.ఒక సేవ కార్యక్రమానికి 20 లక్షలు ఇవ్వడం ఏంటి అని అప్పట్లో అందరు నోరెళ్లబెట్టారు.
ఇక అంత ఇచ్చుకోలేము అని అప్పుడప్పుడే ఎదుగుతున్న జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) చేత సదరు ప్రోగ్రాం ని చేయించారట సదరు సేవ సంస్థ నిర్వాహకులు.అంత ఎందుకు అంది ఒక ప్రముఖ పత్రిక ఒక యాడ్ కోసం చిరంజీవి ఫోటో వాడితే కూడా లీగల్ నోటిస్ లు ఇచ్చాడు అప్పట్లో చిరు.
తన ప్రర్మిషన్ లేకుండా ఆలా ఫోటో కూడా వాడుకోకుడు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు.ఇప్పుడు అయితే ఇంకా అందరు ముదిరిపోయారు.
మొన్నటికి మొన్న నాగార్జున( Nagarjuna ) ఒక సోషల్ మీడియా ఈవెంట్ కి అతిధిగా రావడానికి ఏకంగా రెండు కోట్లు అడిగాడట.ఇలా ఉంది స్టార్ హీరోల వరస.పైసా లేనిదే ఏ పని చేయరు.ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రావాలన్న, ఒక వీడియో బైట్ చెప్పాలన్న, ఎవరికి అయినా విషెష్ చెప్పాలన్న కూడా ఇదే తంతు.
నాకు ఎంత ఇస్తావ్ అని ముందుగా అడుగుతారు.ఇక పక్క హీరోల సినిమా విడుదల అయ్యాక చాల బాగుంది అని పొగడటానికి కూడా డబ్బులు లేకుండా ఎలాంటి ట్వీట్ చేయడం లేదు.
తన సొంత సినిమా ప్రమోషన్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో చేయాలన్న కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు మహానుభావులు.