కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్. ఫస్ట్ వైవ్ కంటే వేగంగా, విసృతంగా సెకెండ్ వేవ్‌లో వ్యాప్తి చెందుతోంది.
ఈ మహమ్మారి ధాటికి ప్రజలు ఉపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.ఈ సెకెండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో బెడ్స్ కొరత ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ శాతం మంది మృత్యువాత పడుతున్నారు.
కరోనాను అదుపు చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.మరోవైపు ఎక్కడికక్కడ లాక్డౌన్ విధిస్తున్నారు.
అయినప్పటికీ ఈ మాయదారి వైరస్ వ్యాప్తిలో వేగంగా తగ్గడం లేదు.
ఇక ఇలాంటి భయానక పరిస్థితుల్లో కరోనా సోకిన వారు తమ ప్రాణాలను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా కరోనా రోగులు కొన్ని కొన్ని ఆహారాలకు దైరంగా ఉండాలి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.కరోనా సోకిన వారు ఆయిల్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.ఆయిల్ ఫుడ్స్ శరీరంలో కొవ్వును పెంచడంతో పాటు జీర్ణ వ్యవస్థ పని తీరును మందగించేలా చేస్తాయి.
దాంతో కరోనా నుంచి కోలుకోవడం కష్టం అవుతుంది.
అలాగే చాలా మంది కరోనా రోగులు రుచి తెలియడం లేదని.
ఘాటుగా ఉండే మసాలాలు, కారాలు తీసుకుంటున్నారు.
కానీ, వీటి వల్ల గ్యాస్ ట్రబుల్, ఛాతిలో మంట, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు ఏర్పడతాయి.మురియు దగ్గు కూడా పెరుగుతుంది.
పిజ్జా, బర్తర్లు, బిస్కెట్స్, డో నట్స్, కాఫీ, కూల్ డ్రింక్స్, షుగర్‌తో తయారు చేసిన స్వీట్లు, చిప్స్, ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.
ఎందుకంటే, కరోనా సోకిన వారు త్వరగా కోలుకోవాలంటే రోగ నిరోధక వ్యావస్థ బలంగా ఉండాలి.కానీ, ఈ ఆహారాలు తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీన పడుతుంది.అలాగే ఉప్పు అతిగా తీసుకోవడం తగ్గించాలి.ఆల్కహాల్, స్మోకింగ్ వంటి వాటికి ఎంత దూరంగా ఉండే కరోనా నుంచి అంత త్వరగా కోలుకుంటారు.