ఉపవాసం చేసేవారు ఉదయం ఈ ఒక్క డ్రింక్ తీసుకుంటే నీరసం అన్న మాటే అనరు!

సాధారణంగా పండగ సమయాల్లో చాలా మంది ఉపవాస దీక్ష ( fasting )తీసుకుంటూ ఉంటారు.అలాగే వారానికి ఒకసారి ఉపవాసం చేసేవారు కూడా ఎంతో మంది ఉన్నారు.

 Best Energy Drink For Fasting People! Fasting, Energy Drink, Latest News, Health-TeluguStop.com

ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపవాసం చేస్తూంటారు.ఎలా చేసిన కూడా ఉపవాసం రోజు నీరసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.

పైగా ఆ నీరసం రెండు మూడు రోజులు పోనే పోదు.అయితే ఉపవాసం చేసేటప్పుడు నీరసం దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకునే సామర్థ్యం కొన్ని కొన్ని పానీయాలకు ఉంది.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను ఉపవాసం చేసేవారు ఉదయం కనుక తీసుకుంటే నీరసం అన్న మాటే అనరు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Energy, Day, Benefits, Tips, Latest-Telugu Health

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు అంజీర్( fig ) వేసుకోవాలి.అలాగే ప‌ది ఎండుద్రాక్ష( raisins ), ఆరు బాదం పప్పులు( Almonds ), ఆరు జీడిపప్పులు( Cashew nuts ), ఆరు పిస్తా పప్పులు( Pistachio nuts ) , నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు మరియు ఒక కప్పు వేడి పాలు వేసుకుని బాగా కలిపి గంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నాన‌బెట్టుకున్న పదార్థాలన్నిటినీ వేసుకోవాలి.అలాగే ఒక అరటి పండు మరియు ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మన ఎనర్జీ డ్రింక్ రెడీ అవుతుంది.

Telugu Energy, Day, Benefits, Tips, Latest-Telugu Health

ఈ డ్రింక్‌ లో ప్రోటీన్ తో సహా మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు నిండి ఉంటాయి.ఉపవాసం చేసేవారు ఉదయం ఈ ఒక్క డ్రింక్ ను కనుక తీసుకుంటే రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.నీరసం, అలసట వంటివి మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మీ కడుపు నిండుగా ఉన్న అనుభూతి ఉంటుంది.అలాగే ఉప‌వాసం చేసిన రోజు మాత్ర‌మే కాకుండా మీరు ఈ డ్రింక్ ను రెగ్యులర్ గా కూడా తీసుకోవచ్చు.ఎముకలను బలోపేతం చేయడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో, బరువు నిర్వహణలో ఈ డ్రింక్ చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube