ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై బీఆర్ఎస్ పార్టీ నేత కడియం శ్రీహరి తీవ్రంగా మండిపడ్డారు.రాజయ్య స్థాయి మరిచి మాట్లాడుతున్నారన్నారు.
అంతేకాకుండా పార్టీ నిబంధనలు కూడా పాటించడం లేదని చెప్పారు.తనపై, తన కుటుంబంపైనా రాజయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తాను ఎస్సీనన్న కడియం తన పిల్లలు కూడా ఎస్సీనేనన్నారు.ఈ మాత్రం రాజయ్యకు తెలియదా అని ప్రశ్నించారు.
ఏపీ, బెంగళూరులో ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తావా అని అడిగారు.దీనిపై ఆధారాలు ఇస్తే ఘన్ పూర్ దళితులకు రాసిస్తానన్నారు.
రాజయ్య చట్టం చదువుకోలేదా అని నిలదీశారు.ఈ క్రమంలో రాజయ్య బేషరతుగా తల్లులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యేకు వారం రోజుల డెడ్ లైన్ ఇచ్చారు.







