ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో( Javelin Throw ) ఈవెంట్‌లో బంగారు పతకం గెలిచిన అర్షద్ నదీమ్‌పై( Arshad Nadeem ) డబ్బుల వర్షం కురుస్తోంది.ఈ ప్లేయర్ కష్టపడి శిక్షణ తీసుకున్నప్పటికీ, ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్ కు వెళ్లడానికి అతను చందాలపై ఆధారపడాల్సి వచ్చింది.
ఇప్పుడు ఆయన గొప్ప విజయం సాధించడంతో ఆయనకు రాజకీయ నేతలు, ఇతర సెలబ్రిటీల నుంచి అనేక బహుమతులు లభిస్తున్నాయి.
దాదాపు 40 ఏళ్ల తర్వాత దేశానికి ఈ బంగారు పతకం( Gold Medal ) లభించడం చారిత్రాత్మక విజయం.
కానీ, ఆయనకు వచ్చిన ఈ భారీ బహుమతులను ఆయన వద్దే ఉంచుకోవచ్చా? అనే సందేహం ఉంది.పాకిస్తాన్ ప్రభుత్వం( Pakistan Government ) అర్షద్ నదీమ్‌కు వచ్చిన బహుమతుల నుంచి కొంత మొత్తాన్ని పన్ను( Tax ) రూపంలో కట్ చేసుకోనుంది.
పన్ను ఎగవేతను నిరోధించడానికే ఈ పని చేస్తున్నట్లు ఆ ప్రభుత్వం చెబుతోంది.ఒలింపిక్స్‌లో గెలిచినందుకు అర్షద్‌కి 20 కోట్ల పాక్ రూపాయలు బహుమతిగా వచ్చాయి.అర్షద్ ఇప్పటికే తన ఆదాయానికి పన్ను చెల్లిస్తుంటే, రూ.20 కోట్లలో 15% అంటే 3 కోట్లు పన్నుగా ఇవ్వాలి.అర్షద్ ఆల్రెడీ ట్యాక్స్ పేయర్ అతను రూ.20 కోట్లలో 30% అంటే రూ.6 కోట్లు పన్నుగా ఇవ్వాలి.
అర్షద్ నదీమ్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలిచినందుకు చాలా మంది అభినందనలు తెలుపుతూ, బహుమతులు ప్రకటించారు.ఆ దేశంలోని పంజాబ్ ముఖ్యమంత్రి మర్యం నవాజ్ అర్షద్‌కి 10 కోట్ల రూపాయలు బహుమతిగా ప్రకటించారు.సింధ్ ప్రభుత్వం కూడా అర్షద్‌కి 5 కోట్ల రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నారు.
అంతర్జాతీయ క్రీడా సంస్థ అయిన వరల్డ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ 1 కోటి 40 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తున్నారు.
సింధ్ గవర్నర్ కమ్రాన్ తెస్సోరి, క్రికెటర్ అహ్మద్ షెహజాద్, ఒక సింగర్ కలిసి అర్షద్‌కి 30 లక్షల రూపాయలు బహుమతిగా ఇచ్చారు.ARY ఛానెల్ యజమాని సల్మాన్ ఇక్బాల్ అర్షద్‌కి ARY లగూనాలో ఒక అపార్ట్‌మెంట్‌ను బహుమతిగా ప్రకటించారు.
మరోవైపు ఒలింపిక్స్ మెడల్ తెచ్చిన అర్షద్ నదీమ్‌ని పారిస్‌లోని పాక్ ఎంబసీ వద్ద ఎంతో ఘనంగా స్వాగతించారు.
అర్షద్‌ని చూడాలని, ఆయనతో ఫోటో తీసుకోవాలని చాలా మంది జనాలు గుంపులు గుంపులుగా వచ్చారు.