టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ఎన్టీఆర్.
కాగా తారక్ చివరగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.
అంతే కాకుండా ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారాడు ఎన్టీఆర్.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర.
( Devara ) ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే 41 ఏళ్ల ఎన్టీఆర్ దేవర సినిమాతో కలిపి ఇప్పటి వరకు దాదాపుగా 30 సినిమాలు చేశాడు.
ఈ 30 సినిమాల్లో సంక్రాంతికి వచ్చిన మూవీస్ కేవలం 5 మాత్రమే.వీటిలో సక్సెస్ అయినవి 2.అయితే ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు సంక్రాంతి( Sankranti ) బరిలో నిలిచాడు తారక్.ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు ఎన్టీఆర్.2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతోంది.దీంతో ఎన్టీఆర్ సంక్రాంతి సెంటిమెంట్ పై కొత్త చర్చ మొదలైంది.
ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీలో కాస్త వెనక్కి వెళ్తే నా అల్లుడు, ఆంధ్రావాలా, నాగ, అదుర్స్, నాన్నకు ప్రేమతో సినిమాలు జనవరి నెలల్లో విడుదల అయ్యాయి.వీటిలో అదుర్స్, నాన్నకు ప్రేమతో సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి.నా అల్లుడు మూవీ తర్వాత సంక్రాంతికి రావడం తగ్గించేశాడు,
మళ్లీ ఐదేళ్లకు అదుర్స్ తో( Adhurs ) సంక్రాంతి బరిలో నిలిచాడు.అదుర్స్ తర్వాత మళ్లీ ఆరేళ్లకు సంక్రాంతికీ వచ్చాడు.ఎన్టీఆర్ చివరి సంక్రాంతి సినిమా నాన్నకు ప్రేమతో. ఆ మూవీ వచ్చిన పదేళ్ల తర్వాత మరోసారి సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు ఈ స్టార్ హీరో.2026లో ప్రశాంత్ నీల్ సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు.మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి మరి.మరి ఆ బ్యాడ్ సెంటిమెంట్ను బ్రేక్ చేసి ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి మరి.