అక్కినేని నాగచైతన్య సమంత( Samantha ) విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత నాగచైతన్య( Nagachaitanya ) నటి శోభిత( Sobhita ) ప్రేమలో పడ్డారు.ఇలా వీరిద్దరూ ప్రేమ వివాహానికి ఇరువురు కుటుంబ సభ్యులు అంగీకారం తెలియచేయడంతో ఇటీవల నాగచైతన్య శోభిత నిశ్చితార్థం తమ కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా జరిగింది.
ఇక వీరి ప్రేమ పెళ్లిని నాగార్జున( Nagarjuna ) అధికారకంగా ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన నాగచైతన్య శోభిత తమ ఇంటి కోడలుగా అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది.ఈ నిశ్చితార్థంతో( Engagement ) నా కొడుకు నాగచైతన్య చాలా సంతోషంగా ఉన్నారు.తన ఆనందమే మా ఆనందం వీరిద్దరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను అంటూ నిశ్చితార్థపు ఫోటోలను షేర్ చేశారు.
అయితే సమంత అభిమానులు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేక గతంలో శోభితకు సంబంధించిన కొన్ని బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.సమంత ది ఫ్యామిలీ మెన్( The Family Man ) వెబ్ సిరీస్ లో కాస్త గ్లామర్ షో చేయడం వల్లే విడాకులు తీసుకున్నారన్న వాదన రావడంతో సమంత అభిమానులు ఈమెకు సంబంధించిన బోల్డ్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

ఇకపోతే అక్కినేని అభిమానుల మాత్రం శోభితకు తమ వంతుగా చిన్న రిక్వెస్ట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.ఇప్పటివరకు మీరు ఎలాంటి బోల్డ్ ఫోటోషూట్లు చేసిన బోల్డ్ వీడియోస్ చేసిన ఇకపై మాత్రం చేయకండి.మీరు అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్తున్నారు.ఆ లెగసీని కాపాడే బాధ్యత పూర్తిగా ఉంది అంటూ శోభితకు అభిమానులు రిక్వెస్ట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.అయితే నాగార్జున కుటుంబం కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కుటుంబం కావడంతో శోభితకు అలాంటి ఆంక్షలు ఏమి విధించి ఉండరని మరికొందరు కూడా భావిస్తున్నారు.