ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ లో సక్సెస్ గా నిలిచిన మురారి సినిమాను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఇక మురారి సినిమా( Murari ) రిలీజ్ సందర్భంగా మహేష్ అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు.
మురారి సినిమాను థియేటర్లో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నారు.మురారి రీ రిలీజ్ దెబ్బకు రికార్డులన్నీ బద్దలు అయ్యాయి.
కేవలం నైజాంలోనే మూడు కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది.మరో నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు మూవీకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్లను రాబట్టుకుంది.
అయితే మహేష్ బాబు ( Mahesh Babu )ఫ్యాన్స్ మురారిని సెలెబ్రేట్ చేసుకోవడంతో కమిటీ కుర్రోళ్లు సినిమా మీద కూడా ప్రభావం పడ్డట్టుగా కనిపిస్తోంది.ఈ విషయంతో మీద దర్శకుడు యదు వంశీ తాజాగా నిర్వహించిన సక్సెస్ మీ ట్‌లో మాట్లాడారు.మహేష్ బాబు ఫ్యాన్స్ మురారిని బాగా సెలెబ్రేట్ చేసుకున్నారు.మా సినిమాను కూడా వారంతా చూడాలని కోరుకుంటున్నాను అని అన్నాడు.మరి ఈ మురారి దెబ్బకు బాక్సాఫీస్ అయితే షేక్ అయిపోయింది.ఇక మురారి సినిమా కలెక్షన్ ల విషయానికి వస్తే.మురారి సినిమాకు నైజాంలో 2.9 కోట్లు, ఉత్తరాంధ్రలో 30 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 18 లక్షలు, వెస్ట్‌లో 16 లక్షలు, నెల్లూరులో 3.5 లక్షలు, గుంటూరులో 22 లక్షలు, కృష్ణా 25 లక్షలు, సీడెడ్‌లో 33 లక్షలు, కర్ణాటకలో 22 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షలు ఓవర్సీస్‌లో 60 లక్షలు ఇలా మొత్తంగా 5.45కోట్లు వచ్చాయి.
ఇకపోతే కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu )సినిమా విషయానికి వస్తే.ఈ మూవీ మొదటి రోజు 1.63 కోట్లు కొల్లగొట్టింది.ఈ వారం రిలీజ్ అయిన కొత్త చిత్రాల్లో కమిటీ కుర్రోళ్లు టాప్ ప్లేస్‌లో నిలిచింది.
చూస్తుంటే ఈ వారంలో కమిటీ కుర్రోళ్లే పెద్ద హిట్‌గా నిలవనుంది.మంచి పాజిటివ్ టాక్, మౌత్ టాక్ తో కమిటీ కుర్రోళ్లు సినిమా థియేటర్లో బాగానే ఆడేలా ఉంది.
ఇక ఓటీటీ లోనూ ఈ చిత్రం భారీ హిట్ అయ్యేలా కనిపిస్తోంది.కానీ ఈ మురారి రీ రిలీజ్ మాత్రం కొత్త చిత్రాల కలెక్షన్ల మీద ఎఫెక్ట్ అయితే చూపించిందని చెప్పాలి.
మరి ముందు ముందు కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎలాంటి కలెక్షన్స్ రాపడుతుందో చూడాలి మరి.