టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో( Devara ) నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయింది.
చిన్న చిన్న పనులను పూర్తి చేస్తూనే మరొకవైపు బాలీవుడ్ సినిమా వార్ 2 లో నటిస్తున్నారు ఎన్టీఆర్.ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.ఇలా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ఎన్టీఆర్.NTR31 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ క్రేజీ మూవీ 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా.కేజీఎఫ్, సలార్ ల సక్సెస్ తో మంచి జోరు మీదు ఉన్న ప్రశాంత్ నీల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తారోనని అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
ఇకపోతే ఈ సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ కథ ఇదేనంటూ అనేక రకరకాల కథనాలు వస్తున్నాయి.అయితే #NTR31ని 1969లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారని ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.ఆ సమయంలో భారత్, చైనా, భూటాన్ సరిహద్దుల్లో గోల్డెన్ ట్రయాంగిల్‌గా పేర్కొనే ఏరియాలో డ్రగ్స్ స్మగ్లింగ్, ఈల్లీగల్ దందాలు ఒక రేంజ్‌లో జరిగేవట.
ఖున్ సా( Khun Sa ) అనే వ్యక్తి కను సన్నల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ , ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరిగేవట.పెద్ద మొత్తంలో ఓపియం ను ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేస్తుండటంతో ఇతనిని మయన్మార్ లో ఓపియం కింగ్ గా అభివర్ణించేవారట.1976 నుంచి 1996 మధ్య ఖున్ సా తన కార్యకలాపాలు యథేచ్చగా నిర్వహించేవాడట.
తనకు ఎదురే లేదనుకున్న దశలో అమెరికన్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఖున్ సా, అతని విదేశీ బ్రోకర్ల మధ్య సంబంధాన్ని బట్టబయలు చేసి, అతని చీకటి సామ్రాజ్యాన్ని పెకిలించే చర్యలు చేపట్టడంతో 1996 లో ఖున్ సా బర్మా ప్రభుత్వానికి లొంగిపోయాడట.అనంతరం తన ప్రైవేట్ సైన్యాన్ని రద్దు చేసి డబ్బు, తన ఉంపుడుగత్తెలతో కలిసి యాంగోన్‌కు వెళ్లిపోయాడట.ఖున్ సా తన చీకటి పనులకు ఫుల్ స్టాప్ పెట్టినప్పటికీ అతని మనుషుల్లోని కొందరు లొంగిపోవడానికి నిరాకరించి, ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారట.అయితే ఖున్ సా మాత్రం చట్టబద్ధంగా మైనింగ్, నిర్మాణ ప్రాజెక్ట్‌లతో పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డాడు.2007లో 73 ఏళ్ల వయసులో ఖున్ సా కన్నుమూశాడు.అయితే అతని మరణానికి కారణం ఏంటనేది నేటికీ మిస్టరీయే.కొందరు మాత్రం డయాబెటిస్, బీపీ, గుండె జబ్బు కారణంగానే ఖున్ సా చనిపోయినట్లు చెబుతారు.నేర సామ్రాజ్యానికి అధిపతిగానే కాదు.ప్రజల చేత మన్ననలు సైతం అతను అందుకున్నాడు.
ఖున్ సా తన అక్రమ సంపాదనను జనం కోసం ఖర్చు చేశాడట.థాయ్‌లాండ్‌లోని థోడ్ థాయ్ పట్టణంలో విశాలమైన రహదారులు, మొదటి పాఠశాలను కట్టించాడట.చైనీస్ వైద్య సిబ్బందితో కూడిన 60 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశాడట.ఒక జలవిద్యుత్ ప్రాజెక్ట్‌కు కూడా శ్రీకారం చుట్టి పనులు మొదలుపెట్టగా ఖున్ సా మరణం తర్వాత దాని నిర్మాణం ఆగిపోయిందని స్థానికులు చెబుతారు.
అతని జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలుగు నెటివిటీకి అనుగుణంగా మార్చి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో సినిమా తీయనున్నారని టాక్.మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే మరి.