యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) త్వరలో ప్రశాంత్ నీల్( Prashanth Neel ) సినిమాతో బిజీ కానున్నారనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా జరిగాయి.

 Young Tiger Junior Ntr Watch Become Hot Topic Details, Ntr, Jr Ntr, Jr Ntr Costl-TeluguStop.com

అయితే ఈ పూజా కార్యక్రమాలలో తారక్ ధరించిన వాచీ( NTR Watch ) ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.ఈ వాచ్ ఖరీదు ఏకంగా 2.5 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.ఒక వాచ్ కోసం 2.5 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సులువైన విషయం కాదు.

ఈ వాచీ పటేక్ ఫిలిప్పీ అనే ప్రముఖ కంపెనీకి సంబంధించిన వాచ్ అని సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.ఆ స్థాయిలో పారితోషికం అందుకునే హీరో వాచ్ కోసం ఏకంగా మూడు లక్షల డాలర్లు ఖర్చు చేయడం అంటే ఆశ్చర్యకరమైన విషయం కాదని ఫ్యాన్స్ చెబుతున్నారు.

తారక్ భవిష్యత్తు సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నాయి.

తారక్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో హిట్ గా నిలిస్తే రాబోయే రోజుల్లో సృష్టించే సంచలనాలు అయితే మామూలుగా ఉండవని చెప్పవచ్చు.దేవర సినిమా( Devara ) రిలీజ్ కావడానికి మరో 50 రోజుల సమయం మాత్రమే ఉంది.సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం తారక్ భవిష్యత్ ప్రాజెక్ట్ లు మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.

తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీపై ఇప్పటికే ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమా పాన్ వరల్డ్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.ప్రశాంత్ నీల్ తమ సినిమాలలో హీరోలను ఎంతో పవర్ ఫుల్ గా చూపిస్తారనే సంగతి తెలిసిందే.15 నెలల గ్యాప్ లో తారక్ మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube