తెలుగు ప్రేక్షకులకు నటి సమీరా రెడ్డి( Sameera Reddy ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట జై చిరంజీవ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును ఏర్పరచుకుంది.
ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన అశోక్ సినిమాలో నటించింది.అయితే ఆమె తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపును ఏర్పరచుకుంది.
ఈమెకు అందం అభినయం అన్నీ ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఎక్కువ కాలం నిలవలేకపోయింది.పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.

అయితే సినిమా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఆమె తరచూ సోషల్ మీడియా( Social media )లో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లోనే ఉంది.ఈ నేపథ్యంలోనే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటు తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది సమీరా.తాజాగా సమీరా రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.సమీరా రెడ్డి తాజాగా తన తల్లి ఇచ్చిన హారం గురించె తెలిపింది.

అత్తగారు ఇచ్చిన నగలు, చెవి రింగుల గురించి తెలిపింది.ఐదేళ్ల క్రితం కట్టుకున్న తనకు ఇష్టమైన, ఎంతో ప్రత్యేకమైన చీర గురించి చెప్పింది.అవన్నీ వారసత్వంగా వస్తున్నాయని, ఈ నగలన్నీ కూడా తాను తన కూతురికి ఇస్తానంటూ సమీరా రెడ్డి తెలిపింది.
ప్రస్తుతం సమీరా రెడ్డి ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలలో పట్టు చీర ధరించడంతోపాటు వారసత్వంగా వస్తున్న నగలను ధరించింది.ఆ ఫోటోలలో సమీరా రెడ్డి చాలా అందంగా కనిపిస్తోంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.