ప్రముఖ నటి జయప్రద( Jayaprada ) ఎన్నో సినిమాల్లో నటించింది.భూమికోసం సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది.
దాని తర్వాత 1975, ఆగస్టు 1న విడుదలైన “నాకూ స్వతంత్రం వచ్చింది”( Naku Swatantram Vachindi ) సినిమాలో రవికాంత్ సరసన జయప్రద నటించింది.కృష్ణంరాజు( Krishnam Raju ) ఈ మూవీలో హీరో.
నటుడు ఎం.ప్రభాకరరెడ్డి దీనిని సొంత డబ్బులతో ప్రొడ్యూస్ చేశాడు. పి.లక్ష్మీ దీపక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు చెల్లపిళ్ళసత్యం మ్యూజిక్ అందించాడు.ఈ సినిమా పోస్టర్ల లో రవికాంత్( Ravikanth ) జయప్రద ఇద్దరూ హత్తుకున్నట్లు చూపించారు.నూతన జంట అని ప్రమోషన్లు కూడా చేశారు.నిజానికి ఈ సినిమాలోనే ముందుగా జయప్రద అవకాశం దక్కించుకుంది కాకపోతే ఇది ముందుగా రిలీజ్ కాలేదు.రిలీజ్ అయి ఉంటే ఆమె ఫస్ట్ సినిమా ఇదే అయ్యి ఉండేది.
ఈ సినిమాలో షావుకారు జానకి( Sowcar Janaki ) అందరికంటే ఎక్కువ ఆ ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషించింది.ఈ పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది ఆమెకు పవర్ ఫుల్ డైలాగులు కూడా రాశారు.ఈ సినిమాలో జానకి పెత్తందారుగా పల్లె జనాలను పీక్కుతింటున్న భర్తను చాలా ధైర్యంగా ఫేస్ చేస్తుంది.భర్త కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఆమెను తుపాకీతో కాల్చేసి చంపేస్తాడు.
గణేష్ పాత్రో ఈ సినిమాలో డైలాగులు అద్భుతంగా రాశాడు.షావుకారు జానకి అంతకుమించి నటించింది.
ఇక రెబల్ హీరోగా కృష్ణంరాజు టెరిఫిక్ పర్ఫామెన్స్ కనబరిచాడు.ఒక వర్గ పోరాటం కథతో ఈ సినిమా వచ్చింది.
ఇందులో ప్రభాకరరెడ్డి , గుమ్మడి , నాగభూషణం, పద్మనాభం , రాజబాబు, అల్లు రామలిఃగయ్య , రావు గోపాలరావు, మాడా వంటి ప్రముఖ నటులు కూడా నటించారు.వారు తమ పాత్రల మేరకు చాలా బాగా యాక్ట్ చేశారు.కాకినాడ , ఉప్పాడ ప్రాంతాలలో ఔట్ డోర్ షూటింగ్ కంప్లీట్ చేశారు.ఎర్రసైన్యం లాంటి విప్లవ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.ఈ మూవీ కమర్షియల్ గా ఫీల్ కాలేదు అలాగని ప్రేక్షకులకు నచ్చిందని చెప్పలేం నిజానికి ఇది ఎవరికి పెద్దగా ఎక్కలేదు, పట్టలేదు.ప్రభాకర్ రెడ్డి( Prabhakar Reddy ) ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ రిజల్ట్ అతడిని ముంచేసింది.
ఈ సినిమాలను అంతకుముందు ఆదరించారు కానీ ఆ తర్వాత ప్రేక్షకులు ఈ జానర్ సినిమాలను రిజెక్ట్ చేశారు.
ఇందులో “ఏమాయె ఏమాయె పిల్లా”, “బతకనివ్వరురా వున్నోళ్ళు”, “సోతంత్రం వచ్చింది మన పంతం నెగ్గింది”, “ఎంకీ నే సూడలేనే ఎలుతురులో నీ రూపు”, “ఏయ్ నాయుళ్ళ సిన్నోడు నడిమింటి చంద్రుడు” సాంగ్స్ చాలామందిని విశేషంగా ఆకట్టుకున్నాయి.