అక్కినేని నాగచైతన్య,( Naga Chaitanya ) శోభిత ధూళిపాల( Shobitha Dhulipala ) ఎంగేజ్మెంట్ వేడుక నాగార్జున ఇంట్లో జరిగిన విషయం తెలిసిందే.ఎప్పటినుంచో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలో ఒకటి కాబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి.
అయితే ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటి అయ్యారు.గురువారం రోజు ఆగష్టు 8న వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.
అప్పటి వరకు చైతన్య, శోభిత గురించి ఫ్యాన్స్, నెటిజన్లు రూమర్స్ మాత్రమే వింటూ వచ్చారు.
అవే రూమర్స్ నిజం కావడంతో ఫ్యాన్స్ తో పాటు, చిత్ర పరిశ్రమ కూడా ఆశ్చర్యపోయింది.అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) స్వయంగా శోభిత, చైతన్య నిశ్చితార్థం జరిగిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.శోభితని తమ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
కొత్త జంటని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఆ ఫోటోలని కూడా నాగార్జున అభిమానులతో పంచుకున్నారు.నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం వార్త బయటకి రాగానే ఒక్కసారిగా సమంత( Samantha ) గురించిన చర్చ సోషల్ మీడియాలో ఎక్కువైంది.2017లో చై సామ్ వివాహం చేసుకుని 2021లో విడిపోయారు.శోభితతో నాగ చైతన్య నిశ్చితార్థం జరిగిన తర్వాత నాగార్జున తొలిసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాగార్జున ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.చై గత జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం విషయంలో మా కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది.
సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య నరక వేదన అనుభవించాడు.కానీ ఆ బాధని ఎవరితోనూ చెప్పుకోలేదు.
ఇప్పుడు నా కొడుకు తిరిగి సంతోషంగా ఉండడం తమకి ఆనందంగా ఉందని నాగార్జున తెలిపారు.చై, శోభిత వివాహం గురించి స్పందించారు.
వీళ్లిద్దరి పెళ్ళికి కాస్త సమయం తీసుకుంటాం అని నాగార్జున తెలిపారు.బహుశా కొన్ని నెలలు ఆలస్యంగా వీరి వివాహం జరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు.