తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు.అందులో ఎన్టీఆర్( NTR ) ఒకరు… ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు.
ఇక ఈరోజు ఈ సినిమా పూజ కార్యక్రమాలను జరుపుకుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించిన విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది.ఆ పాత్ర ఏంటి అంటే ఈయన ఒక సామ్రాజ్యానికి అధిపతిగా కనిపించబోతున్నారట.
అందులో ఆయనను ఒక పవర్ఫుల్ నియంత లాగ కూడా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.నిజానికి ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ 2 సినిమా చేయాలి.కానీ ఆ సినిమా లేట్ అయిపోయిన కొద్దీ ఎన్టీఆర్ తో ఈ సినిమాని పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతానికి దేవర సినిమా( Devara movie ) చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా మీద రోజు రోజుకి అంచనాలు తగ్గిపోతున్నాయి.ఇక సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనే దాని మీద కూడా సరైన క్లారిటీ అయితే లేదు.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం దేవర సినిమా ఒక సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని కొంతమంది చెప్తుంటే మరి కొంతమంది మాత్రం ఈ సినిమా మీద ఎన్టీయార్ కి నమ్మకం లేదు అందుకే పట్టుబట్టి మరి ప్రశాంత్ నీల్ తో కాంబినేషన్ ని సెట్ చేసుకున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి… ఇంక తన తోటి హీరోలైన ప్రభాస్, రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్లతో సినిమాలను చేస్తున్నారు.కాబట్టి ఎన్టీయార్ కూడా అదే రూట్లో ముందుకు నడుస్తున్నట్లుగా తెలుస్తుంది
.