తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క ఖ్యాతిని ప్రపంచం నలుమూలాల చాటిచెబుతున్న దర్శకులలో రాజమౌళి( Rajamouli ) మొదటి స్థానంలో ఉంటాడు.ఆయన క్రియేట్ చేసిన రికార్డులను ఆయనే బ్రేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
ఇక ఒక్కసారి ఆయన సినిమాలతో రికార్డుని క్రియేట్ చేస్తే ఆయన ఆ రికార్డును తుడిచివేస్తాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు ఇప్పుడు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ సంపాదించుకుంటున్నాయి.
ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు మహేష్ బాబుతో( Mahesh Babu ) ఒక సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా పాన్ వరల్డ్ ( Pan World )లో తెరకెక్కుతుంది.
ఇక ఈ సినిమా తర్వాత ఆయన మరొక భారీ ప్రాజెక్టు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఆయన లిస్టులో రామ్ చరణ్,( Ram Charan ) తమిళ్ స్టార్ హీరో అయిన విక్రమ్ ( Vikram )లాంటి హీరోలు ఉన్నారు.మరి వీళ్ళిద్దరితో కలిపి సినిమా చేస్తాడా లేదంటే ఇండివిజువల్ గా సినిమా చేస్తాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ప్రస్తుతానికైతే రామ్ చరణ్ కి ఒక లైన్ కూడా వినిపించారట.
దానికి రామ్ చరణ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది.ఇక మహేష్ బాబు తో సినిమా 2027 రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ తో సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుసస్తోంది.ఇక ఈలోపు రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమాని, సుకుమార్ తో చేస్తున్న మరొక సినిమాని ఫినిష్ చేసి రాజమౌళి సినిమా కోసం రెడీగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే రాజమౌళి తర్వాత సినిమాని రామ్ చరణ్ తో చేయడానికి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది.