అందరూ ముందు ఉదయం నిద్ర లేవగానే మొదట చేసే పని బ్రెష్ చేసుకోవడం.కొంతమంది రాత్రి నిద్రపోయే ముందు కూడా బ్రష్ చేసుకోవడం లాంటి అలవాటుగా మార్చుకుంటూ ఉంటారు.
అయితే బ్రష్ ఎవరు, ఎప్పుడు ఎలా కనిపెట్టారో అని ఆలోచించారా.? ఎప్పుడు ఎలా తయారు చేశారు.? అన్న అంశాలు తెలుసుకోవాలి అని అనుకున్నారా.? ఎవరు ముందు బ్రష్ ను వినియోగించారన్న విషయాలను తెలుసుకుందామా మరి.
వాస్తవానికి పళ్ళు తోముకోవడం అనే అలవాటు వందల వేల ఏళ్ల కిందట నుంచే ఉందట.పళ్ళు తోముకోవడం దంతాలు తెల్లగా ఉంచుకోవడం అనేది చరిత్రలో చాలా పాతదే అని క్రీస్తుపూర్వం 3000లో ప్రజలు ప్రజలు చెట్ల సన్నని కొమ్మలను ఉపయోగించి పళ్ళు తోముకునే వారట.
మొదటిసారి బ్రష్ చేసే పద్ధతిని ప్రపంచానికి చైనానే పరిచయం చేసిందట.చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం జూన్ జూన్ 26,1498 చైనా పాలకుడు మొదటిసారి టూత్ బ్రష్ ను వినియోగించారని తెలియజేస్తున్నారు.
అంతకంటే ముందు పూర్వం ప్రజలు బూడిద, డాతున్ తదితర వాటితో పళ్లను శుభ్రం చేసుకునే వారని పురాణాలు చెబుతున్నాయి.అయితే మొట్టమొదటిసారి టూత్ బ్రష్ ను పంది వెంట్రుకలతో తయారు చేసినట్లు సమాచారం.
అయితే ముళ్ళతో గల టూత్ బ్రష్ ను పళ్ళు తోముకోవడం చాలా కష్టమని భావించి పంది మెడ వెనుక నుంచి తీసిన వెంట్రుకలు నుంచి తయారు చేయించారట.ఇది ఇలా ఉండగా ఆధునిక యుగ టూత్ బ్రష్ ను 1780 సంవత్సరంలో విలియం ఎడ్డీస్ అనే ఆంగ్ల ఖైదీ ఒకరు కనుగొన్నారు.అలాగే అతను కూడా పంది జుట్టు నుంచి టూత్ బ్రష్ ను తయారు చేశారట.అనంతరం 1950 సంవత్సరంలో డుపోంట్ డి నెమోర్స్ ‘నైలాన్ బ్రిస్ట్ టూత్ బ్రష్‘ ను గుర్రపు వెంట్రుకలతో తయారు చేశారు.
ఆ తర్వాత కాలానుగుణంగా వస్తున్న టెక్నాలజీ కారణంగా అనేక రకాల టూత్ బ్రష్ లను మనం వాడుతున్నాం.