Jayalalithaa : పెళ్లికూతురుగా ముస్తాబైన జయలలిత ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేసింది?

ఒక వ్యక్తిని గుండెలనిండా నింపుకొని, ఆమె తన ప్రపంచం గా ఆరాధిస్తూ, ఆమెను మోసం చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ ప్రేమకుడికి ఎంత నరకం ఉంటుంది చెప్పండి.అది మాటల్లో చెప్తే అర్థం కాదు.

 Why Jayalalitha Tried To Kill Her Self-TeluguStop.com

ఆ వేదన అంతా ఉండదు.బ్రతికి ఉండి కూడా లాభం లేదు అనే పరిస్థితి వస్తుంది.

అచ్చం అలాంటి పరిస్థితి వచ్చింది శోభన్ బాబు( Shobhan Babu )కి.జయలలిత( Jayalalithaa ) ఒక్క సినిమా చేస్తే చాలు అని అనుకున్నా శోభన్ బాబు ఆ తర్వాత ఆమె మొత్తం జీవితానికి అతడే ప్రపంచం అన్న విధంగా మారిపోయాడు.చాలామంది ఈ శోభన్ బాబు జయలలితలు నిజంగానే ఒకరినొకరు ఎంతో గారంగా ప్రేమించుకున్నారని ఒప్పుకుంటారు కానీ విడిపోవడానికి గల కారణం విషయానికొస్తే పూర్తి బాధ్యత శోభన్ బాబుది భార్యను వదల లేక, ప్రియురాలని పెళ్లి చేసుకోలేక శోభన్ బాబు నలిగిపోయాడు అని చెప్తూ ఉంటారు.

Telugu Jayalalitha, Kutty Padmini, Shobhan Babu, Sobhan Babu-Telugu Stop Exclusi

జయలలిత శోభన్ బాబు ని పిచ్చిగా ప్రేమించింది.పెళ్లి( wedding ) చేసుకోవాలనుకుంది అతడు ఎంత వద్దన్నా వినకుండా తన జీవితంలోకి వెళ్లాలని పెళ్లి ముహూర్తం కూడా పెట్టించింది కానీ చివరికి పెళ్లి రోజు శోభన్ బాబు పెళ్లి పీటలకు మీదికి రాకుండానే వెళ్లిపోయాడు.ఫోన్ చేసి తాను రాలేను అని చెప్పి క్షమించమని వేడుకున్నాడు.

అక్కడితో ఆ బంధం ముగిసిపోయింది.కానీ ఆ విషాద వార్త చెవిన పడ్డ జయలలిత పెళ్లి బట్టల్లోనే కుప్పకూలిపోయింది.

తన ప్రపంచమంతా పేకా మేడల్లా కూలిపోతుంది అని అర్థం కాగానే తనను తాను నిందించుకోలేక శోభన్ బాబుని ఏమీ అనలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసింది అని ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన కుట్టి పద్మిని ( Kutty Padmini )తెలిపారు ఆరోజు జయలలిత నువ్వు పెళ్లికూతురుగా ముస్తాబు చేసింది ఆవిడే అని కూడా చెప్పారు.

Telugu Jayalalitha, Kutty Padmini, Shobhan Babu, Sobhan Babu-Telugu Stop Exclusi

ఇక జయలలితను మోసం చేశాను అనే బాధలు శోభన్ బాబు కూడా చాలా కృంగిపోయారు ఆమె గురించిన ఆలోచనలే అతడిని ఉక్కిరిబిక్కిరి చేశాయట.ఎంతగా ప్రేమించాను అంతగా మోసం చేశాను అని నిందించుకుంటూ తనలో తానే గడపడానికి ఎక్కువగా ప్రయత్నించారట.ఎవరితో మాట్లాడటానికి కూడా కొన్ని రోజులపాటు ప్రయత్నించలేదట.

ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ గాయం తాలూకా గుర్తులు కాలంతో పాటే మాసిపోయాయి.మరి కొన్నాళ్లకు శోభన్ బాబు తిరిగి మామూలు జీవితం మొదలుపెట్టాడు.

జయలలిత కూడా ఉవ్వున లేచిన అలలా సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ బిజీ అవుతూ వచ్చింది.మొత్తానికి ఈ ఇద్దరి ప్రేమ శోభన్ బాబు జయలలిత తమ గుండెల్లోనే సమాధి కట్టేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube