గర్భిణులు చెక్కెర వాడితే డేంజర్..ఎందుకో తెలుసా

Eating Sugar During Pregnancy Is Not Safe

స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.ఎందుకంటే వాళ్ళు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే దాని ప్రభావం తప్పకుండ లోపల ఉన్న శిశువు మీద పడుతుంది.

 Eating Sugar During Pregnancy Is Not Safe-TeluguStop.com

ఆహార నియమాలలో.నిద్ర విషయంలో.

ఇలా ఉదయం లేచిన నిమిషం నుంచీ పడుకునే వరకూ తప్పకుండా వైద్యులు చెప్పే విధంగానే నడుచుకోవాలి.తిండి విషయంలో తప్పనిసరిగా న్యూట్రిషన్ సలహాలు పాటించాలి.

అయితే తాజాగా పరిశోధకులు తెలిపిన విషయాల ప్రకారం.గర్భిణులు గర్భం దాల్చినప్పటి నుంచీ.

బిడ్డ పుట్టే వరకూ కూడా చెక్కెర (పంచదార)ని వాడటం మానేయమని చెప్తున్నారు

ఈ విషయాన్ని ఎదో సాధారణంగా చెప్పినది కాదు.కొంతమంది పరిశోధకులు పరిశోధన చేసి తేల్చిన విషయం.

గర్భిణులు చెక్కెరతో చేసిన పదార్ధాలు తినడం వలన పుట్టబోయే బిడ్డకి కొన్ని రకాల జబ్బులు వస్తాయని వారి పరిశోధనలో తేలింది.అలర్జీలతో,ఆస్తమా, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయట.

గర్భం దాల్చిన వంద మంది మీద వీరు తొమ్మిదినెలల పాటు అధ్యయనం నిర్వహించారు.వీరిలో సగం మందికి చక్కెరతో చేసిన తీపి పదార్థాలను ఇచ్చారు.

మిగతా వారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను అందించారు.ప్రసవం తరువాత వీరికి పుట్టిన పిల్లల ఆరోగ్యాన్ని పరిశీలించారు

అసలు పూర్వం నుంచీ మనకి చెక్కెర వాడకం లేదు బెల్లాన్ని మనం తయారుచేసుకుని వాడేవాళ్ళం.

అయితే చెక్కెరతో చేసిన పదార్ధాలు తీసుకున్న తల్లులకి పుట్టిన పిల్లలు చాలా మందికి కొన్ని రకాల అలర్జీలు రావడం గమనించారు.అదే బెల్లంతో చేసిన పదార్థాలు తీసుకున్న తల్లులకు పుట్టిన పిల్లల్లో అలాంటి సమస్యలను గుర్తించలేదు.

ఈ పరిశోధన ఇక్కడితో ఆగలేదు అని చెక్కెర వాడటం వల్లనే ఇలా జరుగుతుందా లేదా ఇంకేదన్నా కారణం ఉందా అనే కోణంలో కూడా పరిశోధనలు చేస్తున్నాం అని తెలిపారు.కానీ ఆయుర్వేదంలో కానీ మన పూర్వీకులు కానీ చెక్కర వాడకం గురించి ఎక్కడా చెప్పలేదు.

ఏది ఏమైనా గర్భిణులు చెక్కెర వాడకం కంటే కూడా బెల్లాన్ని వాడితే బెటర్ అని చెప్తున్నారు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube