ముఖం మాదిరిగానే శరీరం మొత్తం వైట్‌గా, బైట్‌గా ఉండాలని అందరూ కోరుకుంటారు.అందుకోసమే బాడీకి ఖరీదైన సోప్స్‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.
కానీ, మార్కెట్‌లో లభ్యమయ్యే సోప్స్‌లో చాలా వరకు శరీరాన్ని కఠినంగా మార్చేవే ఉంటాయి.అందుకే చర్మ సంరక్షణ కోసం ఇంట్లోనే సోప్స్‌ను తయారు చేసుకునేందుకు ప్రయత్నించాలి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా సోప్‌ను ప్రిపేర్ చేసుకుని యూజ్ చేస్తే మీ స్కిన్ ఎల్లప్పుడూ బ్రైట్‌గా మెరిసిపోవడం ఖాయం.
మరి ఇంకెందుకు లేటు స్కిన్ బ్రైటనింగ్ సోప్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి.
ముందుగా నీటిలో కడిగిన ఒక టమాటోను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.అలాగే ఒక బంగాళదుంపను తీసుకుని పీల్ తొలగించి తురుముకోవాలి.ఈ తురుము నుంచి జ్యూస్‌ను వేరుచేయాలి.ఇక ఒక సోప్ బేస్‌ను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో మరో గిన్నెను పెట్టి ఒక కప్పు సోప్ బేస్ ముక్కలు వేయాలి.
సోప్ బేస్ బాగా కరిగిన తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్ల బంగాళదుంప జ్యూస్, మూడు టేబుల్ స్పూన్ల టమాటో జ్యూస్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి.చివరిగా ఇందులో రెండు చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి మిక్స్ చేయాలి.

ఆపై ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాక్సుల్లో నింపి.రెండు లేదా మూడు గంటల పాటు వదిలేస్తే సోప్ సిద్ధం అవుతుంది.ఈ న్యాచురల్ సోప్‌ను ప్రతి రోజు వాడితే గనుక స్కిన్ వైట్‌గా, బ్రైట్‌గా మారుతుంది.చర్మంపై త్వరగా ముడతలు ఏర్పడకుండా ఉంటాయి.మరియు బాడీ ఎల్లప్పుడూ స్మూత్‌గా ఉంటుంది.