తెలంగాణలో కాంగ్రెస్ కు ఇంత సీన్ ఉందా ?

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారాన్ని దక్కించుకోలేకపోయింది.మూడోసారి అయినా అధికారాన్ని దక్కించుకుంటుందా అంటే అదీ అనుమానమే.

 According To Survey Congress Is Stronger Than Bjp In Telangana Details, Telangan-TeluguStop.com

ఎందుకంటే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ తర్వాత,  బీజేపీ ప్రభావం తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తోంది.వరుసగా జరిగిన ఉప ఎన్నికల్లోనూ బిజెపి రెండు అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది.

అలాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ ప్రభావం చూపించింది.దీంతో టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే పార్టీగా తెలంగాణలో బీజేపీ పేరు మారుమోగుతోంది.

కాంగ్రెస్ లో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగా ఆ పార్టీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించే లేకపోతూ ఉండడం,  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది అనే అంచనాలు అందరిలోనూ వుండగానే,  ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి.

తెలంగాణలో టిఆర్ఎస్ తర్వాత బీజేపీ కంటే ,  కాంగ్రెస్ ప్రభావం ఎక్కువ అని , ఎన్నికల నాటికి ఆ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని,  దాదాపు 80 , 90 స్థానాల్లో కాంగ్రెస్ బలంగా ఉందని ఆ సర్వేలో వెల్లడైనట్లు సమాచా రం.అయితే కాంగ్రెస్ నాయకుల మధ్య గ్రూపు విభేదాలు లేకపోతే కాంగ్రెస్ ఎప్పుడో తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పార్టీలో గ్రూపు రాజకీయాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్,  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ల మధ్య ఆధిపత్య పోరు తీవ్రం అవుతున్న క్రమంలో,  తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అయ్యేందుకు ఇదే సరైన సమయం.దీనికి తోడు తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టిపెట్టారు.ఈ సమయంలో కాంగ్రెస్ తెలంగాణా నాయకులంతా సమిష్టిగా  టీఆర్ఎస్ పై పోరాటం చేయగలిగితే కాంగ్రెస్ కు తిరుగే ఉండదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాకపోతే కాంగ్రెస్ లో ఏకాభిప్రాయం అనేది అంత తేలికైన విషయం కాదు అనేది జగమెరిగిన సత్యం.

According To Survey Congress Is Stronger Than Bjp In Telangana Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube