ఏసీబీ దూకుడు .. కేటీఆర్ అరెస్ట్ తప్పదా ? 

బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ మేరకు ఏసిబి అధికారులు కేటీఆర్(KTR) పై కేసు నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

 Acb Aggression .. Is Ktr Arrested, Brs, Bjp, Congress, Telangana Elections, Tela-TeluguStop.com

ఇప్పుడు కేటీఆర్ అరెస్టుకు సంబంధించి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Verma) ను అనుమతి కోరినట్లు సమాచారం.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫార్ములా వన్ రేస్ కు సంబంధించి భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

  ఈ రేసు నిర్వహణకు విదేశీ సంస్థలతో ఒప్పందమూ కుదుర్చుకున్నారు.హైదరాబాద్(Hyderabad) లో జరగాల్సిన ఫార్ములా వన్ రేస్ కు సంబంధించి మెట్రోపాలిటీ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులు,  ఫైనాన్స్ క్లియరెన్స్ , మంత్రివర్గ అనుమతి లేకుండా నిధులను బదిలీ చేసినందుకు గాను ఏసిబి దీనిపై దర్యాప్తు చేస్తుంది.

ముఖ్యంగా ఈ వ్యవహారంలో అప్పటి మంత్రి కేటీఆర్(Mantri KTR) మాజీ కార్యదర్శి అరవింద్ కుమార్ (Aravind Kumar)తో పాటు,  ఇతర అధికారులను ఏసీబీ పరిశీలిస్తుంది.గత ఫిబ్రవరిలోనే ఫార్ములా వన్ రేస్ జరగాల్సి ఉంది.

అయితే అది రద్దయింది.కాకపోతే ఎలాంటి అనుమతులు లేకుండా 50 కోట్ల రూపాయలను ఫార్ములా వన్ రేస్ కి చెల్లించిన వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు మొదలు పెట్టింది .సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) సైతం ఈ విషయంపై గతంలోనే స్పందించారు .ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదని,  ఏసీబీ దర్యాప్తు కేవలం అవినీతి ఆరోపణలపై చేస్తోందని రాజకీయ కక్ష సాధింపు చర్యలు కాదని తెలిపారు.అసలు ఒక మంత్రిగాని,  అధికారి గాని అంత పెద్ద మొత్తాన్ని ఏ విధంగా బదిలీ చేయగలరు ? ఎవరు ఈ వ్యవహారంలో లాభ పడ్డారనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.

Telugu Acb Ktr, Congress, Formula Race, Revanth Reddy, Telangana-Politics

ఇక కేటీఆర్ సైతం ఈ ఫార్ములా రేసుకు సంబంధించి నిధులు విడుదల తను వల్లే జరిగిందని అంగీకరించారు.ఈ విషయంలో తాను బెదిరేది లేదని , అవసరం అయితే జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. బిజెపి,  కాంగ్రెస్(Bjp, Congress) తనను లక్ష్యంగా చేసుకున్నాయని మీడియా సమావేశంలోనే అన్నారు.

అక్రమ కేసులకు భయపడను ,పాదయాత్ర చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటా అని కేటీఆర్ ప్రకటించారు.ఫార్ములా రేసింగ్ (Formula race)హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం కోసమేనని కేటీఆర్ అన్నారు.

పెట్టుబడుల కోసమే 55 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని , మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ బాధ్యత తనదేనని కేటీఆర్ అంగీకరించడంతో ఏసిబి అధికారులు కేసు నమోదుకు సిద్ధమవుతున్నారు.ఈ కేసులోనే కేటీఆర్ అరెస్టు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube