పాడుబడ్డ యూఎస్ కాలేజీ లోపల మానవ శరీర భాగాలు.. చూసి షాక్!

ఇటీవల అమెరికాలోని (Amaria)దక్షిణ ప్రాంతంలో ఒక అర్బన్ ఎక్స్‌ప్లోరర్ అన్వేషణ సాగించాడు.అయితే ఆ సమయంలో ఆయనకు ఒక పాడుబడ్డ కాలేజీలో భయంకర దృశ్యాలు బయటపడ్డాయి.

 Shocked To See Human Body Parts Inside A Ruined Us College, Urban Exploration, A-TeluguStop.com

ఒకప్పుడు విద్యార్థులతో కిటకిటలాడిన ఈ కాలేజీ ఇప్పుడు ఎవరూ లేక బాగా పాడు బడ్డది.దీనిని చాలా చాలా కాలం క్రితమే క్లోజ్ చేశారు.

ఈ కాలేజీని సందర్శించిన అర్బన్ ఎక్స్‌ప్లోరర్ లీలాండ్ కెంట్ (Urban explorer Leland Kent)అక్కడ చూసిన దృశ్యాలతో షాక్ అయ్యారు.

శాస్త్రీయ పరిశోధనలకు పేరుగాంచిన ఈ కళాశాలలో జంతువులు, మానవ శరీర భాగాలు బాటిళ్లలో స్టోర్ చేసి ఉన్నాయి.

ఈ భయంకర దృశ్యాల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లీలాండ్(Leland), ఈ కళాశాల 100 సంవత్సరాలకు పైగా కమ్యూనిటీకి సేవ చేసిందని, కానీ ఇప్పుడు అది భయంకరమైన రహస్యాలను దాచుకుంటుందని చెప్పారు.ఈ సంఘటన ప్రజలను కలచివేసింది.

ఒకప్పుడు విజ్ఞానంతో వెలుగులు నింపిన ఈ కళాశాలలో ఏం జరిగిందనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో మెదులుతోంది.

ఈ ఓల్డ్ కాలేజీలో అడుగుపెట్టిన లీలాండ్ కెంట్ అను అర్బన్ ఎక్స్‌ప్లోరర్ కళ్లకు కనిపించిన దృశ్యాలు అతన్ని కంగుతినేలా చేశాయి.

ఈ కాలేజీ లైబ్రరీలో వందలాది పుస్తకాలు అస్తవ్యస్తంగా చెల్లాచెదురుగా ఉన్నాయి.కార్యాలయాలు ఖాళీగా, తరగతి గదులు అస్తవ్యస్తంగా ఉన్నాయి.

అయితే అతన్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచింది సైంటిఫిక్ ప్రయోగశాలలు అని చెప్పుకోవచ్చు.

క్లోరోఫామ్‌ (Chloroform)వంటి విలువైన రసాయనాలు, చర్మంలేని ఎలుకలను బాటిల్‌లో ఉంచడం, తరువాత తొండలు, పక్షులు, పాములు, కప్పలు, సాలె పురుగులు(birds, snakes, frogs, spiders) వంటి అనేక జంతువులను గాజు పాత్రల్లో ఉంచడం లాంటి చర్యలు అతనిని కలచివేశాయి.అత్యంత భయంకరమైన దృశ్యం ఏమిటంటే, ఒక మానవ గర్భాశయం కూడా ఒక జాడిలో ఉంది.ఈ కళాశాలలో కనిపించిన ఈ విచిత్రమైన దృశ్యాలు అందరినీ ఆశ్చర్యచకితులను చేశాయి.

ఒకప్పుడు ఈ కాలేజీ విద్యార్థులకు కామర్స్, ఎడ్యుకేషన్, సైన్స్ వంటి కోర్సులు అందించింది.కానీ కాలక్రమంలో ఈ కాలేజీని ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి.అధ్యాపకుల నిర్వహణలోని లోపాలు, ఆర్థిక ఇబ్బందులు కళాశాలను కుంగదీశాయి.ఎన్నో ప్రయత్నాలు చేసినా సమస్యలు తీరకపోవడంతో చివరకు కళాశాలను మూసివేయాల్సి వచ్చింది.భారీ అప్పులు, అధ్వాన్నమైన నిర్వహణ, పేరు పోవడంతో కళాశాల తన అస్తిత్వాన్ని కోల్పోయింది.ఇలా 10 ఏళ్ల క్రితం ఈ కాలేజీ భవనం తలుపులు మూసి వేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube