హిందువులు - సిక్కులను విభజించే యత్నం.. కెనడాలో పరిస్ధితులపై భారత సంతతి ఎంపీ ఆవేదన

కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ మందిర్‌పై ఖలిస్తాన్ మద్ధతుదారులు దాడికి దిగడంతో అక్కడ పరిస్ధితులు నానాటికీ దిగజారిపోతున్నాయి.ఉద్రిక్తతల దృష్ట్యా కాన్సులర్ క్యాంప్‌లను కూడా భారత ప్రభుత్వం రద్దు చేసింది.

 Politicians Dividing Hindus And Sikhs In Canada, Says Indian-origin Mp Arya, Sik-TeluguStop.com

ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన కెనడియన్ ఎంపీ చంద్ర ఆర్య(Canadian MP Chandra Arya) కీలక వ్యాఖ్యలు చేశారు.బ్రాంప్టన్ హిందూ సభ మందిర్‌పై ఖలిస్తాన్ (Khalistan)మద్ధతుదారుల దాడిని ఆయన ఖండించారు.

ఈ ఘటనను కొందరు హిందూ – సిక్కుల(Hindus ,Sikhs) మధ్య సమస్యగా చిత్రీకరించారని చంద్ర ఆర్య మండిపడ్డారు.ఇది సమాజాన్ని తప్పుదోవ పట్టించడంతో పాటు హిందువులు, సిక్కుల (Hindus ,Sikhs)మధ్య విభజనను తీసుకొస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఈ దాడికి ఖలిస్తానీలను బాధ్యులుగా గుర్తించడం, లేదా ఇతర సంస్థలపై నిందలు మోపి తప్పించుకుంటున్నారని చంద్ర ఆర్య(Chandra Arya) మండిపడ్డారు.చరిత్రలో హిందువులు, సిక్కులు కుటుంబ సంబంధాల ద్వారా సోదర భావంతో మెలిగారని ఆయన గుర్తుచేశారు.

హిందువులు, సిక్కులు నేడు ఐక్యంగానే ఉన్నారని, భవిష్యత్తులోనూ ఐక్యంగానే ఉంటారని .స్వార్ధ ప్రయోజనాల కోసం మమ్మల్ని విభజించడానికి అనుమతించమబోమని చంద్ర ఆర్య స్పష్టం చేశారు.

Telugu Canada, Hindus Sikhs, Indianorigin, Sikh Canadians-Telugu NRI

సిక్కు కెనడియన్లు(Sikh Canadians) ఓ వైపు, ఖలిస్తానీలు(Khalistanis) మరోవైపు ఉన్నారని ఆయన తెలిపారు.సిక్కు కమ్యూనిటీ నేత, మాజీ బ్రిటీష్ కొలంబియా ప్రీమియర్ ఉజ్జల్ దోసాంజ్‌ని ఉటంకిస్తూ.కొన్ని కెనడియన్ గురుద్వారాలపై ఖలిస్తాన్ మద్ధతుదారుల ప్రభావాన్ని ఆర్య హైలైట్ చేశారు.మెజారిటీ సిక్కులు ఖలిస్తాన్‌కు అనుకూలంగా లేరని వారు హింసాత్మక పరిణామాలపై భయపడతారు కాబట్టి వారేం మాట్లాడరని ఆర్య తెలిపారు.

Telugu Canada, Hindus Sikhs, Indianorigin, Sikh Canadians-Telugu NRI

కాగా.నవంబర్‌లో హిందూ వారసత్వ మాసంను పురస్కరించుకుని కెనడా పార్లమెంట్(Parliament ,Canada) వెలుపల హిందూ పతాకాన్ని ఎగురవేసి సంచలనం సృష్టించారు చంద్ర ఆర్య.రాజకీయాలలో ఎక్కువ మంది హిందూ కెనడియన్లు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.2022 నుంచి హిందూ వారసత్వ మాసంలో భాగంగా ఆయన హిందూ జెండాను ఎగురవేయడం ఇది మూడోసారి.హిందూ మత సాంస్కృతిక, మేధో, ఆధ్యాత్మిక వారసత్వాన్ని తెలుసుకోవడానికి వార్షికంగా ఈ మాసాన్ని జరుపుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube