హీరోయిన్ శోభిత దూళిపాల(Sobhita Dhulipala) గురించి మనందరికీ తెలిసిందే.మరికొద్ది రోజుల్లోనే ఈమె అక్కినేని(Akkineni) ఇంట కోడలిగా అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఎంగేజ్మెంట్తో సగం ఆ ఇంట్లో మంచిగా స్థానం సంపాదించుకుంది.త్వరలోనే హీరో నాగచైతన్యతో(hero Naga Chaitanya) కలిసి మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోంది.
ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.త్వరలోనే పెళ్లి డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు అక్కినేని ఫ్యామిలీ.
ఆ సంగతి పక్కన పెడితే ఇటీవల కాలంలో శోభిత తరచూ ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే.గ్లామర్ ఫోటోలు షేర్ చేయడంతో పాటు తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ.
అక్కినేని వారి కొత్త కోడలంటే చాలా స్పెషల్.అందుకే శోభిత దూళిపాళ్ల కి( sobhita dhulipala) ఇష్టమైన ఫుడ్ ఏమిటి, ఆమెకు ఇష్టమైన డ్రెస్ ఏమిటి, ఆమె ఇష్టపడే ప్రదేశం ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలని అక్కినేని అభిమానులు తెగ కుతూహుల పడిపోతున్నారు.
ఈ మేరకు కొంతమంది అభిరుచులు తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో సెర్చింగ్ ప్రారంభించారు.ఇకపోతే శోభితకు(Sobhita) ఇష్టమైన ఫుడ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.శోభితకు పూనుకులు(Punugulu) అంటే చాలా ఇష్టమట.మన తెలుగు వారికిష్టమైన పూనుకులను శోభిత చాలా ఇష్టంగా లాగించేస్తుందట.అంతేకాదు తెనాలి అమ్మాయైనా శోభిత ఏ తెలుగు ఫుడ్ అయినా అంటే ఆనియన్ సమోసా(Onion Samosa) ఇలాంటివన్నీ ఇష్టంగానే తింటానని తెలిపింది.అయితే ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో శోభిత చెప్పగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అభిమానులు.