మన భారతీయులు ఏదైనా వస్తువు పాడైతే దాన్ని చెత్త కుప్పలో పడేయరు.ఆ పాడైన వస్తువును కూడా తమకు అనుకున్నాంగా మార్చుకుని వాడుతుంటారు.
ముఖ్యంగా మన అమ్మలు దేన్ని వృధాగా పోనివ్వరు చాలా క్రియేటివిటీ గా ఆలోచిస్తూ వాటిని చక్కగా ఉపయోగించుకుంటారు.ఇటీవల సోషల్ మీడియాలో అలాంటి మహిళకు సంబంధించిన ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఒక మహిళ చేసిన పని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.ఆమె ఏం చేసిందంటే, పాడైపోయిన ఫ్రిజ్‌ని తీసుకుని దాన్ని షూ ర్యాక్‌గా(Shoe rack) మార్చేసింది! అవును, మీరు తప్పుగా చదవలేదు.
ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలకు బదులుగా బూట్లు, చెప్పులు అమర్చింది.ఆమెకు వచ్చిన ఈ అద్భుతమైన ఐడియా చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు, ఆమె క్రియేటివిటీకి ఫిదా అయిపోతున్నారు.
ఈ వీడియోను “laughwith_mm19” అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేయగానే వైరల్ అయింది.ఇది చూసిన ప్రతి ఒక్కరూ, “జుగాడు క్వీన్”(“Jugadu Queen”) అంటూ ఆమెను పొగుడుతున్నారు.
అంతేకాదు, ఈ ఆవిష్కరణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా అంటున్నారు.పాత ఫ్రిజ్‌ని షూ ర్యాక్‌గా (fridge,shoe rack)మార్చిన ఆ వీడియోకి ఇప్పటికే 8వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
అంతేకాదు, ఆ వీడియో చూసిన వాళ్ళు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
“ఇది చాలా చౌకైన, చాలా అందమైన హ్యాక్” అని ఒకరు సరదాగా కామెంట్ చేశారు.మరొకరు, “ఆ ఫ్రిజ్ కు ప్రాణం ఉంటే అది ఇప్పుడు ‘చివరికి నన్ను ఇలా కూడా ఉపయోగిస్తున్నారా అమ్మ?’ అని అనుకుంటుంది” అని జోక్ చేశారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ, ప్రజలను తెగ నవ్విస్తోంది.
ఈ ఆవిష్కరణ చూసి అందరూ ఆ మహిళ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.అందరూ కూడా ఈమెలాగా ఆలోచిస్తే చాలా రిసోర్సెస్ మిగిలిపోతాయని, ఎక్కడా కూడా చెత్త అనేది పేరుకుపోదని పేర్కొంటున్నారు.