కంగువ మూవీ సెన్సార్ రివ్యూ.. సూర్య ఖాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ ఖాయమా?

తమిళ హీరో సూర్య(Surya) నటించిన చిత్రం కంగువ(Kanguva).ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Suriya Kanguva Censor Report, Suriya, Kanguva Movie, Censor Report, Tollywood, U-TeluguStop.com

పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ఆ స్థాయిలోనే ఈ సినిమా విడుదల అవుతోంది.ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు రికార్డులను తిరగరాస్తుందని మూవీ మేకర్స్ కూడా అంచనాలు వేస్తున్నారు.

ఇందుకోసం గట్టిగానే మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలు చేస్తున్నారు.ముఖ్యంగా తెలుగులో ప్రత్యేకంగా ఈవెంట్స్ నిర్వహించడం విశేషం.

సినిమా కంటెంట్ అన్ని వర్గాల ఆడియెన్స్ ను నచ్చుతుందని నిర్మాత కూడా బలంగా నమ్ముతున్నారు.

Telugu Censor, Kanguva, Suriya, Tollywood, Ua Certificate-Telugu Top Posts

ఇక ఫైనల్ గా సెన్సార్ వర్క్(censor report) ను ఫినిష్ చేసుకున్న ఈ సినిమా కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది.శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 350 కోట్ల భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో నిర్మించబడింది.తమిళ నేటివిటీ నేపథ్యంలో ఉన్నప్పటికీ పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు.

సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరాయి.అడ్వెంచరస్ సన్నివేశాలు, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ మోషన్ పోస్టర్స్, టీజర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు కాస్త మరింత పెరిగాయి.అయితే సెన్సార్ బోర్డు (censor bord)నుంచి యూఏ సర్టిఫికెట్ రావడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Telugu Censor, Kanguva, Suriya, Tollywood, Ua Certificate-Telugu Top Posts

సినిమాలో ఊచకోత అనేలా బోల్డ్ సీన్స్ ఉన్నట్లు ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చారు.రక్తపాతం ఊహించని రేంజ్ లో ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది.అయితే U/A సరైఫికెట్ (U/A certificate)రావడంతో సినిమాలో అలాంటి సీన్స్ లేవేమో అనేలా కామెంట్స్ వస్తున్నాయి.సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ ను కూడా థియేటర్‌ కి రప్పించేందుకు ఇది కీలకంగా మారింది.మరింత ఆకర్షణీయంగా అనిపించే ఈ సినిమా, ప్రేక్షకులకు 3డీ అనుభవాన్ని అందించనుంది.3డీ ఎఫెక్ట్స్‌తో సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు మరింత బలంగా ఉంటాయని యూనిట్ పేర్కొంటోంది.ఏదేమైనా ఇంత వైల్డ్ సినిమాకు సెన్సార్ రిపోర్ట్ వచ్చిన విధానం హాట్ టాపిక్ గా మారింది.నవంబర్ 14న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube