కోలీవుడ్ స్టార్ హీరో సూర్య( Star hero Surya ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తెలుగు రాష్ట్రాల్లో సైతం సూర్యకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.
సినిమా రంగంలోకి అడుగు పెట్టడం గురించి సూర్య మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.అనుకోకుండా నేను సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని సూర్య తెలిపారు.
కలలో కూడా నటుడిని కావాలని అనుకోలేదని సూర్య చెప్పుకొచ్చారు.
మా నాన్న శివకుమార్ ( Sivakumar )మంచి నటుడు అని నాన్న దాదాపుగా 175 సినిమాల్లో యాక్ట్ చేశారని సూర్య తెలిపారు.
నాకు గార్మెంట్ ఇండస్ట్రీపై కొంచెం ఆలోచన ఉందని ఆ రంగంలో స్థిరపడాలని అనుకున్నానని సూర్య పేర్కొన్నారు.దానికి అవసరమైన పెట్టుబడి నాన్నను అడగాలని అనుకున్నానని సూర్య పేర్కొన్నారు.
అయితే నాన్నకు తెలియకుండా అమ్మ 25 వేల రూపాయలు అప్పు తీసుకున్నారని తీసుకొని ఆరు నెలలు అయిందని సూర్య వెల్లడించారు.

అమ్మ మాటలు విని నేను షాకయ్యానని సూర్య పేర్కొన్నారు.ఆ సమయంలో డైరెక్టర్ వసంత్, మణిరత్నం( Director Vasanth, Mani Ratnam ) మా ఇంటికి వచ్చారని సూర్య వెల్లడించారు.తమ సినిమాలో ఒక నటుడు వైదొలిగాడని అతని స్థానంలో నన్ను తీసుకుంటామని వాళ్లు చెప్పారని సూర్య పేర్కొన్నారు.50 వేల రూపాయలు వేతనంగా ఇస్తామని చెప్పారని సూర్య అన్నారు.ఆ సమయంలో మణిరత్నం కాళ్లు పట్టుకుని ఆ డబ్బు తీసుకొని అమ్మకు ఇచ్చానని సూర్య తెలిపారు.

ఆ విధంగా డబ్బు కోసం సినిమాల్లోకి వచ్చానని సూర్య కామెంట్లు చేశారు.ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ చూసిన తర్వాత ఆ ప్రేమకు ఎంతో రుణపడి పోయానని సూర్య తెలిపారు.పేద విద్యార్థుల కొరకు అగరం ఫౌండేషన్ నడిపిస్తున్నానని సూర్య వెల్లడించారు.గత 14 ఏళ్లలో 6000 మంది విద్యార్థులకు సాయం చేశానని సూర్య తెలిపారు.సూర్య మంచి మనస్సుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.