సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.జిల్లా కలెక్టర్లు ఎన్యూమరేటర్లలతో నిరంతర పర్యవేక్షణ చేయాలి.

 A Comprehensive House-to-house Family Survey Should Be Carried Out Thoroughly ,m-TeluguStop.com

ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించాలి.సర్వే ప్రక్రియను యావత్తు దేశం మొత్తం తెలంగాణను గమనిస్తున్నది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో హౌస్ లిస్టింగ్ పూర్తిచేసుకుని నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు ఎన్యూమరేటర్ల చే సర్వే ప్రక్రియను పకడ్బందీగా నమోదు చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.శనివారం నుండి ప్రారంభమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర సర్వే ఇంటింటి కుటుంబ సర్వే పై సీ.ఎస్.శాంతికుమారి, ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాలతో కలిసి జిల్లా కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.వీడియో కాన్ఫెరెన్స్ కు ఐడిఓసి కార్యాలయం నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ శనివారం నుంచి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలకు అనేక సందేహాలు వస్తుంటాయని నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని సూచించారు.ఎలాంటి సందేహాలున్నా ఎన్యూమరేటర్లు జిల్లా కలెక్టర్ల దృష్టికి తేవాలని పేర్కొన్నారు.సర్వే పై ప్రజలతో మమేకం అయితే సందేహాలు ఏమిటో తెలుస్తామని తక్షణమే నివృత్తి చేయడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు.

ప్రజలు ఎలాంటి అపోహలు పడకుండా ఎన్యూమరేటర్లు కు సమాచారం ఇవ్వాలని సూచించారు.సర్వే ప్రక్రియలో ప్రజల పట్ల ఎన్యూమరేటర్లు భాద్యతగా వ్యవహరించాలని సూచించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు సర్వేలో భాగస్వాములు అయ్యేల ఆహ్వానించాలని తెలిపారు.సమగ్ర కుటుంబ సర్వే చాలా మంచి కార్యక్రమమని ప్రజల సమగ్ర సమాచారం సేకరణ వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయడానికి దోహదపడతాయని తెలిపారు.

హౌస్ లిస్టింగ్ సర్వే దిగ్విజయంగా నిర్వహించారని, అదే ఉత్సాహంతో సర్వే ఆసాంతం పూర్తి అయ్యే వరకు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.సర్వే ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళుతున్నారని భాగస్వామ్యం అయిన కలెక్టర్లను, ఎన్యూమరేటర్లు ను, ప్రణాళికా శాఖ అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు.

ఇదే రీతిలో కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని కోరారు.మనదేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమని, సిబ్బంది నిబద్ధత, అంకితభావంతో సర్వే విజయవంతం చేయాలని అన్నారు.

యావత్తు దేశం మన రాష్ట్రం చేపడుతున్న సర్వేను గమనిస్తుందని నిబద్ధతతో పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలని వివరించారు.దేశంలో ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు.

ఏవైనా సమస్యలు తలెత్తితే జిల్లా కలెక్టర్లు, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావాలని, వచ్చిన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు.సర్వే సమాచారం గ్రామస్థాయిలోని చిట్ట చివరి ఇంటికి చేరే విధంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, గ్రామాలు, పట్టణాల ప్రధాన కూడళ్ళలో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలలోని అధికారులు సర్వే ప్రక్రియ ను పరిశీలిస్తూ సిబ్బందికి తగు, సలహాలు సూచనలు ఇవ్వాలని, ప్రధానంగా పట్టణాలపై దృష్టి పెట్టాలని కోరారు.

అనంతరం జిల్లా కలెక్టర్ సందిప్ కుమార్ ఝ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే కొరకు జారీ చేసిన బుక్ లెట్ లోనీ అంశాలలో ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావు లేకుండా ప్రజల నుండి ఖచ్చితమైన సమాచారం సేకరణతో వివరాలు నమోదు చేయాలని సూచించారు.సర్వే ప్రక్రియను సూపర్ వైజర్లు, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే ప్రక్రియను నిబద్ధతతో నిష్పక్షపాతంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని అన్నారు.ప్రజలు సర్వే సిబ్బందికి సహకరించి సమగ్ర సమాచారం ఇవ్వాలని సూచించారు.

సర్వే కు ఒక రోజు ముందు గ్రామాలు, పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.ప్రజల నుండి సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలు ఖచ్చిత సమాచారం ఇవ్వాలని సూచించారు.

సర్వేపై ప్రజలు ఎలాంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని పేర్కొన్నారు.ఏలాంటి సందేహాలు ఉన్న ఎం.పి.డి.ఓ., తహశీల్దార్ల దృష్టికి తేవాలని తెలిపారు.సర్వే కు నియమించిన ఎన్యూమరేటర్లు ఉపాధ్యాయులు, అంగన్ వాడి, కార్యదర్శులు, డిఆర్డీఓ సిబ్బంది మాత్రమే ఇంటింటికి వస్తారని, ఇతరులు వస్తే సమాచారం ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube