పశు వైద్యశాలలో టాయిలెట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలి పశుసంవర్ధక శాఖ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న పశు వైద్యశాలల ద్వారా సమర్థవంతంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులతో పశుసంవర్ధక శాఖ పై సమీక్ష నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పశుసంవర్ధక శాఖ పని తీరు , చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, పశువులకు టీకా అందించడం వంటి అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న పశు వైద్య ఆసుపత్రులలో సిబ్బంది అందుబాటులో ఉంటూ అవసరమైన వైద్య చికిత్సలు పశువులకు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పశు వైద్యశాలలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ హెచ్చరించారు.జిల్లాలోని పశు వైద్యశాలలో టాయిలెట్స్ లేవని అధికారులు తెలుపగా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ప్రతిపాదనలు సమర్పించాలని మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
జిల్లాలో అక్టోబర్ 25 నుంచి జరుగుతున్న 21వ అఖిల భారత పశు గణన కార్యక్రమం సందర్భంగా విధి కుక్కలు, ఇతర పశువుల వివరాలను కూడా సేకరించాలని కలెక్టర్ తెలిపారు.వేములవాడ రాజన్న ఆలయం పరిధిలో ఉండే పశువులకు అవసరమైన వైద్య చికిత్సలు అందించేలా పట్టిష్ట చర్యలు తీసుకోవాలని వాటి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు.
పశువులలో వ్యాధుల నియంత్రణ కోసం చేపట్టే వ్యాక్సినేషన్ ప్రక్రియ 100% పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.వీధి కుక్కలకు యాంటి రాబిస్ వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో అందించాలని అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, పశు వైద్యాధికారులు, సంబంధించిన తదితరులు పాల్గొన్నారు
.






