గోళ్లు దృఢంగా పొడుగ్గా పెరగాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ప్రస్తుత వర్షాకాలంలో మన చేతులకు ఉండే చిట్టి గోళ్లను కాపాడుకోవడం చాలా కష్టతరంగా మారుతుంటుంది.నీటిలో తరచూ నానడం వల్ల గోళ్లు విరిగిపోతూ ఉంటాయి.

 Follow These Tips For Strong And Long Nails! Strong Nails, Long Nails, Nails, Be-TeluguStop.com

బలహీనంగా తయారవుతుంటాయి.అలాగే గోళ్ల విషయంలో అశ్రద్ధ గా ఉంటే ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లు సైతం దరి చేరుతాయి.

కాబట్టి చేతి గోళ్ల( Fingernails ) విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.ఇకపోతే ఇటీవల రోజుల్లో చాలా మంది ఆర్టిఫిషియల్ గోళ్లకు బాగా అలవాటు పడుతున్నారు.

వాటికోసం వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు.కానీ సహజంగా కూడా మనం పొడవాటి దృఢమైన గోళ్లను పెంచుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలు చాలా ఉత్తమంగా సహాయపడతాయి.

Telugu Tips, Tipslong, Healthy Nails, Long Nails, Nail Care, Nails, Simple Tips-

టిప్ 1: ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అర కప్పు కొబ్బరి నూనె( coconut oil ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ వాము( Ajwain ) వేసి చిన్న మంటపై బాగా మరిగించాలి.ఆరేడు నిమిషాల తర్వాత స్టవ్‌ ఆఫ్ చేసుకుని ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి.

రోజు నైట్ నిద్రించే ముందు ఈ వాము నూనెను చేతి గోళ్ల‌కు అప్లై చేసుకుని పడుకోవాలి.ఈ ఆయిల్ గోళ్లను దృఢంగా మారుస్తుంది.పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.మ‌రియు ఫంగస్ దరిచేరకుండా అడ్డుకట్ట వేస్తుంది.

Telugu Tips, Tipslong, Healthy Nails, Long Nails, Nail Care, Nails, Simple Tips-

టిప్ 2: అరటిపండు( banana ) ఆరోగ్యానికి మాత్రమే కాదు గోళ్లకు కూడా ఎంతో మేలు చేస్తుంది.రెండు టేబుల్ స్పూన్లు అరటి పండు ప్యూరీలో వన్ టేబుల్ స్పూన్ షుగర్ ( Sugar )మరియు వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని గోళ్లకు పట్టించి 20 నిమిషాల పాటు వదిలేయాలి.ఆపై గోళ్లను స్క్రబ్బింగ్ చేసుకుని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒకసారి కనుక చేశారంటే మీ గోళ్లు పొడుగ్గా పెరుగుతాయి.దృఢంగా తయారవుతాయి.

తరచూ విరగకుండా ఉంటాయి.సహజంగానే పొడవాటి బలమైన గోళ్లను కోరుకునే వారికి ఆ రెండు ఇంటి చిట్కాలు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.

కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube