ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో సోషల్ మీడియాలో పోస్టులపై కూటమి ప్రభుత్వం కొరడా జులిపిస్తోంది.నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో(social media)పిచ్చిపిచ్చి పోస్టులతో రెచ్చిపోయిన వారికి చుక్కలు చూపిస్తోంది.
వైసీపీ నేతలతో పాటుగా సోషల్ మీడియా కార్యకర్తలు అలాగే సానుభూతిపరుల్ని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే వెంటాడి చేదిస్తోంది.ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు కూడా నమోదు అయిన విషయం తెలిసిందే.
ఇప్పటికే చాలామందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అలాగే హైకోర్టులో సైతం హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు అయ్యాయి.
వీటిపై విచారణ కూడా జరుగుతోంది.ఈ క్రమంలో గతంలో కూటమి నేతలపై విమర్శలు చేసిన వారంతా దారికొస్తున్నారు.లోకేష్ గారూ(Lokesh) మీకు సారీ, అలాగే మీ అమ్మ గారెకి, మీ భార్య గారెకి సారీ, అనిత(Anita) గారికి, అలాగే పవన్ కళ్యాణ్(pawan kalyan) గారికీ సారీ అంటూ ఇలా పేరుపేరునా కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి స్వారీలు క్షమాపణలు చెబుతున్నారు.అందులో భాగంగానే తాజాగా శ్రీరెడ్డి ఒక వీడియో విడుదల చేశారు.
నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని (మధ్యలో నాకు భవిష్యత్తు లేదనుకోండి నేను పెళ్లీ పెటాకులు అని అనుకోవట్లేదంటూ) తన వల్ల తన కుటుంబానికి ఇబ్బంది రాకూడదని ఈ క్షమాపణ చెబుతున్నట్లు శ్రీరెడ్డి తెలిపారు.
ఇకపై తన సోషల్ మీడియాలో మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని శ్రీరెడ్డి వెల్లడించారు.ఏ విధమైన తప్పుడు వ్యాఖ్యలు చేయనని హామీ ఇచ్చారు.ఈ యుద్ధాన్ని కార్యకర్తలకూ, మీకు కాకుండా లీడర్లు, లీడర్లకూ మధ్య జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
తమ కార్యకర్తల్ని వదిలిపెట్టమంటూ విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటున్నట్లు శ్రీరెడ్డి ఎన్డీయే(Sri Reddy NDA) ప్రభుత్వానికి, నేతలకు విజ్ఞప్తి చేసారు.దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
అయితే శ్రీ రెడ్డి(Sri Reddy) ఉన్నపలంగా ఇలా ప్లేట్ ఫిరాయించడంతో చాలామంది శ్రీ రెడ్డి పై బూతులతో కామెంట్స్ చేస్తున్నారు.ఒకప్పుడు వాడకూడని పదాలు కూడా వాడి వారిని తిట్టావు మరి ఇప్పుడు అదంతా ఏమయింది అంటూ ఆమెపై విరుచుకుపడుతున్నారు.