టాలీవుడ్ హీరోయిన్ సమంత (heroine Samantha)) గురించి మనందరికీ తెలిసిందే.సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ,మరొకవైపు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఆచితూచి సినిమాలను చేస్తోంది సమంత.ఇకపోతే సమంత తాజాగా నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్.
ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తోంది సమంత.
ఇది ఇలా ఉంటే తాజాగా సామ్ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) పై ప్రశంసలు కురిపించారు.ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమంత మాట్లాడుతూ నటి ప్రియాంక చోప్రా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా సమంత(Samantha) మాట్లాడుతూ.ఇటీవల లండన్ (London)వెళ్లినప్పుడు ప్రియాంకా చోప్రాను కలిశాను.ఆమె ఒక పవర్‌హౌస్.అని తెలిపింది సమంత.
అలాగే ప్రియాంక చోప్రా నా రోల్ మోడల్ అంటూ ఆసక్తికర కామెంట్ చేసింది.అనంతరం తన కొత్త వెబ్‌సిరీస్ సిటడెల్: హనీ-బన్నీ(Honey-Bunny) దర్శకులు రాజ్, డీకే(Raj, DK)ల గురించి మాట్లాడుతూ.
మేకింగ్ లో వారిది ప్రత్యేక శైలి.అందుకే చాలామంది వారి దర్శకత్వంలో నటించాలనుకుంటున్నారు.నా తదుపరి ప్రాజెక్టు వాళ్లతోనే చేస్తున్నాను అని తెలిపారు సామ్.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.ఇకపోతే సమంత విషయానికి వస్తే మొన్నటి వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ రెస్టు తీసుకున్న సమంత ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ సినిమాలలో ఫుల్ బిజీ బిజీ అవ్వడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.