టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవిశ్రీ ప్రసాద్, థమన్( Devisree Prasad, Thaman ), మరి కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్లు అనుకున్న సమయానికి అవసరమైన ఔట్ పుట్ విషయంలో ఫెయిలవుతున్నారు.
పుష్ప ది రూల్ షూట్ మొదలై దాదాపుగా మూడేళ్లు అవుతున్నా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా ఔట్ పుట్ ను ఆలస్యం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేవిశ్రీ ప్రసాద్ ఇతర వ్యాపకాలతో బిజీగా ఉండటం వల్లే ఈ సినిమా ఔట్ పుట్ ఆలస్యమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
థమన్ ఔట్ పుట్ విషయంలో ఇలాంటి విమర్శలు ఎదుర్కోకపోయినా థమన్ సైతం కొన్నిసార్లు క్వాలిటీ విషయంలో విమర్శలు ఎదుర్కోవడం గమనార్హం.అయితే జీవీ ప్రకాష్ మాత్రం ఒకవైపు హీరోగా కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
జీవీ ప్రకాష్ ( Jv Prakash )తాను మ్యూజిక్ అందించిన ప్రతి సినిమాకు సరైన సమయంలో వర్క్ ఫినిష్ చేస్తానని సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందే వర్క్ పూర్తి చేస్తానని ఆయన తెలిపారు.నెలలో 12 రోజులు మాత్రమే హీరోగా షూట్ లో పాల్గొంటానని మిగతా 18 రోజులు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా ఉంటానని ఆయన కామెంట్లు చేశారు.జీవీ ప్రకాష్ రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉంది.
జీవీ ప్రకాష్ కు తెలుగులో ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు రావడం వెనుక అసలు కారణం ఇదేనని తెలుస్తోంది.జీవీ ప్రకాష్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నా తన లక్ష్యాలను నెరవేర్చుకోవడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.జీవీ ప్రకాష్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
జీవీ ప్రకాష్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.