వీడియో: అమాయకుడిలాగా కనిపిస్తూనే తెగించిన దొంగ.. అతడు చేసిన పనికి షాక్!

ఈ రోజుల్లో దొంగతనాలు బాగా ఎక్కువైపోతున్నాయి.అమాయకంగా కనిపించే వాళ్లు కూడా దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలకు షాకులు ఇస్తున్నారు.

 Video: Desperate Thief Who Looks Like An Innocent.. Shocked By What He Did!, Bad-TeluguStop.com

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ఇలాంటి ఒక షాకింగ్ దొంగతనం చోటుచేసుకుంది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో, ఓ దొంగ ఒక దుకాణదారుడి కళ్లలోకి ఎర్ర మిరపకాయ పొడిని చల్లి, ఒక మొబైల్ ఫోన్ దొంగతనం చేసి పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి.

తనని ఎవరూ గుర్తుపట్టకుండా టోపీ, మాస్క్‌లు(Hats ,masks) వేసుకున్న ఆ దొంగ, కౌంటర్‌ ఒక వైపు నిలబడ్డాడు.

దుకాణంలో ఓ వృద్ధుడు కుర్చీలో కూర్చుని తన మొబైల్ ఫోన్‌లో బిజీగా ఉన్నాడు.కళ్లద్దాలు వేసుకున్న దుకాణదారుడు అతని పక్కనే నిలబడ్డాడు.కారం కళ్లలో పడిన వెంటనే ఆ షాప్ ఓనర్ నొప్పితో వెనక్కి జరిగాడు.ముందుగా వృద్ధుడు ఆశ్చర్యపోయాడు.

కొద్ది సేపటికి ఏం జరుగుతుందో అర్థమై, “అతన్ని పట్టుకోండి! అతన్ని పట్టుకోండి!” అని అరిచాడు.కానీ ఆపేలోపు దొంగ పారిపోయాడు.

వీడియోలో, ఈ దొంగ ఒక మొబైల్ ఫోన్ కొనడానికి దుకాణానికి వచ్చినట్లు అమాయకంగా నటించడం మనం చూడవచ్చు.ఆ ఫోన్ ధర రూ.13,570.ఆ వ్యక్తి ఆన్‌లైన్‌లో పే చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు నటిస్తూ, తన జేబు నుంచి కారంపొడి(chilli powder)) తీసి షాపు ఓనర్ కళ్ళలోకి చల్లాడు.

ఆ తర్వాత, ఆ ఫోన్‌ను లాక్కొని దుకాణం నుంచి పారిపోయాడు.

ఈ ఘటన గురించి జర్నలిస్ట్ అనురాగ్ శుక్లా తన ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.ఆయన, “ఇది చాలా దారుణం! ఈ వ్యక్తి రూ.13,570 విలువ చేసే ఫోన్ కొనడానికి వచ్చినట్లు నటించాడు.ఆన్‌లైన్ పేమెంట్(online payments) చేయడానికి తన ఫోన్ తీయబోతున్నట్లు నటిస్తూ, దుకాణదారుడి కళ్ళలోకి చిల్లీ పౌడర్ చల్లి పారిపోయాడు.ఈ ఘటన బదౌన్ జిల్లా బిల్సీ పట్టణంలో(Bilsi town, Badaun district) జరిగింది.

పోలీసులు ఇప్పుడు ఆ దొంగ కోసం వెతుకుతున్నారు” అని రాశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube