ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే.ఎగ్జిట్ పోల్స్, సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.
భారత సంతతికి చెందిన , డెమొక్రాటిక్ పార్టీ (Democratic Party)అభ్యర్ధి కమలా హారిస్(Kamala Harris) ఓటమి పాలయ్యారు.తొలుత ట్రంప్‌కు గట్టి పోటి ఇచ్చిన ఆమె తర్వాత చేతులెత్తేశారు.
ఈ నేపథ్యంలో ఫలితాలపై స్పందించారు భారత సంతతి నేత, యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా.
డెమొక్రాటిక్ పార్టీ ప్రజల ఆర్ధిక ఇబ్బందులను పరిష్కరించడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు.
కొత్త ఫ్యాక్టరీలను నిర్మించడం, కనీస వేతనాలను పెంచడంలో సాయం చేయడం, పిల్లల సంరక్షణ, మెరుగైన ఆర్ధిక విధానాన్ని నొక్కి చెప్పడంపై మాకు విజన్ ఉండాల్సిందన్నారు.డెమొక్రాట్లకు (democratic)ఆర్ధిక దృష్టి లేదని, శ్రామికులకే కాకుండా మొత్తం అమెరికన్ల ఆర్ధిక కష్టాలను పరిష్కరించడం వంటివి చేయాలని రో ఖన్నా సూచించారు.
పార్టీలోని మితవాదులను, అభ్యుదయ వాదలను ఇలాంటి నిర్ణయాలు ఏకం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.ట్రంప్ కంటే తమకు మంచి విజన్ ఉందని.లాటినో ఓటర్లు, నల్లజాతి, శ్వేతజాతీయులు, శ్రామిక తరగతి ఓటర్ల మద్ధతు లభిస్తుందన్నారు.అమెరికా ప్రతినిధుల సభకు సిలికాన్ వ్యాలీ(Silicon Valley) నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు రో ఖన్నా(Ro Khanna).
నవంబర్ 5న జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఆ ప్రాంతంలో 20 నుంచి 30 శాతం మంది ఓటర్లు అండగా నిలిచినట్లు తెలిపారు.
శాస్త్ర , సాంకేతిక రంగాల్లో డెమొక్రాట్లు పెట్టిన పెట్టుబడిని ప్రతి ఒక్కరికీ గుర్తుచేయాల్సిన అవసరం ఉందన్నారు.ఒబామా హయాంలో నిధులు పొందడం వల్లే ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ప్రారంభమైందని రో ఖన్నా గుర్తుచేశారు.తిరిగి ప్రజల మద్ధతు గెలుచుకుంటామని, 2008లో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.