యాదాద్రి భువనగిరి జిల్లా:ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అధ్వర్యంలో వర్గీకరణ సాధన కోసం రాజకీయాలకు అతీతంగా జాతి ఐక్యత చాటాలని పలువురు మాదిగ రాజకీయ నేతలు పిలుపునిచ్చారు.ఆదివారం భువనగిరి పట్టణంలోని ఎస్వీ పంక్షన్ హల్లో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణపై సుదీర్ఘంగా 30 ఏళ్లుగా న్యాయబద్ధమైన పోరాటం జరిగిందని,చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా అమలు చేయడంలో ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని వాపోయారు.
వర్గీకరణ అమలు జరిగే వరకు మాదిగ,మాదిగ ఉప కులాలు మరో ఉద్యమం నడపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు,పీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య,ప్రముఖ న్యాయవాది నాగారం అంజయ్య,బర్రె జాంగిర్,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ,లింగాల వెంకన్న,బొజ్జ సుందర్, బోడ సునీల్,వంగూరి ప్రసాద్,మాచర్ల జగ్జీవన్ రామ్ మాదిగ,మాచర్ల సైదులు మాదిగ, మేధావులు,ఎమ్మార్పీఎస్ మరియు అన్ని దళిత అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.