పత్తి రైతుకు కోపం వచ్చింది... రోడ్డుకు అడ్డంగా పత్తి లోడు పెట్టాడు

నల్లగొండ జిల్లా:అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లుగా అన్నదాతల పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారిపోతుందని,ఆరుగాలం కష్టం చేసి,అప్పులు చేసి పండించిన పంటని అమ్ముకునే స్థితి లేకుండా పోయిందని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివరాలకు వెళితే…నల్గొండ జిల్లా దేవరకొండ పత్తి కొనుగోలు కేంద్రానికి హలియా నుండి పత్తి లోడుతో వచ్చాడు.

 Cotton Farmer Got Angry He Put A Load Of Cotton Across The Road, Cotton Farmer,-TeluguStop.com

మూడు రోజులు దాటినా పత్తి దిగుమతి చేసుకోకపోవడంతో విసుగుచెంది తను తీసుకువచ్చిన పత్తి లోడు వాహనం కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై అడ్డంగా పెట్టి నిరసన తెలియజేశాడు.దీనితో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అడ్డుగా పెట్టిన వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ తేమ శాతం ఉన్నప్పటికీ కూడా దిగుమతి చేయడం లేదని,మూడు,నాలుగు రోజుల నుండి పస్తులు ఉంటూ పడిగాపులు కాసినా పండించిన పత్తిని అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నామని,అధికారులు తేమ పేరుతో వేధిస్తున్నారని,ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ల వాహనాలను దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపించాడు.

అదేవిధంగా మరోపక్క దళారులతో కుమ్మక్కై దళారులు తీసుకొచ్చిన వాహనాల పత్తిని మాత్రమే దిగుమతి చేసుకుంటూ రైతులు తీసుకొచ్చి పత్తి దిగుమతి చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు.మూడునాలుగు రోజుల నుండి ఇక్కడే పడిగాపులు కాస్తుంటే ట్రాక్టర్ కిరాయిలు కట్టలేక పోతున్నామని,ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తే ఆశతో తీసుకొచ్చినందుకు వేధిస్తున్నారని,ఇప్పటికైనా సిసిఐ ఉన్నతాధికారులు స్పందించి రైతు తీసుకువచ్చిన పత్తిని దిగుమతి చేయాలని ప్రాధేయపడ్డాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube