రేషన్ కార్డుల కోసం కొత్త సర్కారుపై కోటి ఆశలు...!

నల్లగొండ జిల్లా: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వాటిని తక్షణమే అమలు చేయాలని ప్రజలు అభ్యర్థిస్తున్నారు.

 Millions Hope On Congress Government For Ration Cards, Congress Government ,rat-TeluguStop.com

కాకపోతే ఆయా పథకాలు పొందాలంటే రేషన్‌కార్డులు కీలకం కానున్నాయి.ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రేషన్ కార్డు అనేది అత్యంత ప్రాధాన్యం.

దీంతో తమకు నిరాశ తప్పదని ఇప్పటి వరకు కార్డు పొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొత్త ప్రభుత్వం రేషన్‌ కార్డులు జారీచేసే ప్రక్రియపై ఫోకస్ చేయాలని కోరుతున్నారు.

కార్డులు లేక ఎన్నో ఏళ్లుగా సంక్షేమ పథకాలకు దూరమయ్యామని,అలాగే రేషన్‌ బియ్యం పొందలేక పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పడు ఏర్పడిన కొత్త ప్రభుత్వమైనా తమకు రేషన్‌ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube