కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపుని అడ్డుకోలేరు

నల్లగొండ జిల్లా:మునుగోడు మండలంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ఇప్పర్తి,తేరేట్పల్లి,రావిగూడెం, జక్కలవారిగూడెం గ్రామాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు,మాజీ సర్పంచ్ లు,వివిధ పార్టీల నాయకులు శుక్రవారం బీజేపీలో చేరారు.వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 No Matter How Many Conspiracies Kcr Does, He Cannot Stop Bjp From Winning-TeluguStop.com

అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మునుగోడులో గెలిచేది బిజెపినే అని ధీమా వ్యక్తం చేశారు.ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా భారతీయ జనతా పార్టీని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితులు లేవని అన్నారు.

ప్రజలు ఎవరిని గెలిపించాలో ఎప్పుడో డిసైడ్ అయిపోయారని అన్నారు.కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపుని అడ్డుకోలేరని,తాను రాజీనామా చేసింది మునుగోడు ప్రజల బాగు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసమని అన్నారు.

రాజీనామా చేశాకే అన్ని అభివృద్ధి పనులు మొదలయ్యాయని,ఇప్పటికే గొర్రెలు,చాప పిల్లలు,గడియారాలు,గొడుగులు పంపిణి చేస్తున్నారన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube