ఆరోగ్యానికి సంబంధించిన మంచిపనులన్ని పొద్దున్నే మొదలుపెట్టాలని చెబుతారు డాక్టర్స్.ఎందుకంటే మన శరీరం మీద ధ్యాస పెట్టడానికి అదే మంచి సమయం.
ముఖ్యంగా చర్మ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు పొద్దున్నే తీసుకోవాలి.అసలే ఇది ఎండకాలం కదా.ఆయిల్, చెమట, టాక్సిన్స్ సమస్య ఎక్కువ ఉంటుంది.ఇలాంటి పరిస్థితులలో చర్మాన్ని సంరక్షించుకోవాలంటే ఉదయాన్నే తొందరగా లేచి, కొంత సమయం మన శరీరం మీద, ముఖ్యంగా చర్మం కోసం కేటాయించాలి.
మరి పొద్దున్నే ఏం చేస్తే చర్మం యొక్క ఆరోగ్యాన్ని మనం మెయింటేన్ చేయగలమో, అందాన్ని పెంచుకోగలమో, స్కిన్ డ్యామేజ్ నుంచి తప్పించుకోగలమో చూడండి.
* ఉదయాన్నే మీ చర్మాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి.
అందుకోసం సబ్బు వాడకుండా, రోజ్ వాటర్ ని ఉపయోగించండి.కాటన్ పై రోజ్ వాటర్ స్ప్రే చేస్తూ, ముఖంపై ఉన్న ఆయిల్ ని, డర్ట్ ని శుభ్రపరుచుకోండి.
మురికి లేని టవల్ తో ముఖం తుడుచుకోండి.లేదంటే ఫ్రెష్ కాటన్ తో పని కానియ్యండి.
* రెండు గ్లాసుల మంచినీళ్ళు తాగండి.బాడి హైడ్రేటెడ్ గా ఉంటేనే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
అదే చేత్తో గ్రీన్ టీ లేదా నిమ్మరసం తయారు చేసుకోని తాగండి.ఎందుకంటే మీ చర్మం మీద లోపలినుంచి దాడిచేస్తాయి టాక్సిన్స్.
ఈ మలీనాలు బయటకి పోవాలంటే గ్రీన్ టీ, నిమ్మరసం లేదంటే ఆపిల్ సైడర్ వెనిగర్ అవసరం.
* మంచి టోనర్ ని అప్లే చేసుకోండి ఆ తరువాత.
మళ్ళీ రోజ్ వాటర్ కావచ్చు, ఆపిల్ సైడర్ వెనిగర్ కావచ్చు, ఆరెంజ్, బొప్పాయి గుజ్జు .ఇవన్నీ టోనర్స్ గా పనిచేస్తాయి.
* యాంటిఆక్సిడెంట్స్ బాగా దొరికే ఆహారపదార్థాలు తీసుకోండి.గోజి బెర్రిస్, బ్లూ బెర్రిస్, కిడ్నీ బీన్స్, నట్స్, గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవాలి.బ్రేక్ ఫాస్ట్ లో సలాడ్స్, స్టీమ్డ్ ఫుడ్స్ తీసుకోవాలి.ఖర్చుకు వెనకాడితే, సింపుల్ గా ఇడ్లీ తినండి.
* పనికి బయలుదేరేముందు డాక్టర్ సూచించిన సన్ స్క్రీన్ లోషన్ మాత్రమే వాడండి.ముఖ్యంగా మగవారు డాక్టర్ సూచిస్తేనే సన్ స్క్రీన్ లోషన్ వాడాలి, అలాగే డాక్టర్ వాడమంటేనే వాడాలి.
* విటమిన్ సి ఉండే ఆరెంజ్ ఒకటి తిని ఆఫీసుకి బయలుదేరితే మంచిది.ఎంత సన్ స్క్రిన్ లోషన్ వాడినా, యూవి రేస్ మీద ఆరెంజ్ చూపే ప్రభావం వేరు.
విటమిన్ సి మోలికూల్ స్కిన్ సెల్స్ డ్యామేజ్ అవకుండా కాపాడుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.