ఎడమ కాలువకు నీటి విడుదల చేయాలి:రైతు సంఘం పాల్వాయి రామిరెడ్డి

నల్లగొండ జిల్లా:సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల చేసి ఎండిపోతున్న పొలాలకు నీరందించి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం మండల కార్యదర్శి పాల్వాయి రామిరెడ్డి( Palvai Ramireddy ) అన్నారు.సోమవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని సాగర్ ఎడమ కాలువ ( Sagar left canal )పరిధిలోని పొలాలను పరిశీలించారు.

 Water Should Be Released To The Left Canal: Raitu Sangam Palvai Ramireddy , Nal-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ వానకాలంలో కంటే వేసవిలో సాగు దిగుబడి తక్కువ శాతం ఉందని,ఆ పంటలు చిరుపొట్ట దశ నుండి వడ్లయ్యే పరిస్థితిలో ఉన్నాయని, ఒక నెల రోజుల్లో పంట పూర్తిగా చేతికొచ్చే అవకాశం ఉన్న సమయంలో నీళ్ళు అందక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పని చేయడం లేదని,ఈ పరిస్థితి రైతాంగం పూర్తిగా నిరాశలో కూరుకుపోయారని అన్నారు.

సాగర్ కాలవ ద్వారా 15 రోజుల పాటు నీటి విడుదల చేస్తే పంట పొలాలు చేతికొచ్చే అవకాశం ఉందని,వెంటనే నీటి విడుదల చేయాలని కోరారు.లేనిపక్షంలో ప్రభుత్వం పంటలు ఎండిపోయిన రైతాంగానికి ఎకరానికి రూ రూ.40 వేల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీనివాస్, చల్లబట్ల ప్రణీత్ రెడ్డి,కోడి వెంకన్న,రైతులు( Farmers ) మట్టయ్య,మల్లయ్య,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube