నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్గొండ జిల్లాలో( Nalgonda District ) లిక్కర్ అప్లికేషన్స్ రికార్డ్ స్థాయిలో వచ్చాయి.336 మద్యం దుకాణాలకు 15,117 దరఖాస్తులు రాగా, రూ.302 కోట్ల 34 లక్షల ఆదాయం సమకూరింది.గత 2021 డిసెంబర్ లో 8,224 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం రూ.164 కోట్ల 48 లక్షలు.ఈసారి దానికి రెట్టింపు ఆదాయం వచ్చింది.
ఇంకా స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
జిల్లాల వారీగాచూస్తే నల్గొండ జిల్లాలో 155 మద్యం దుకాణాలకు( Liquor stores ) గతానికి రెట్టింపుగా 6994 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.139 కోట్ల 88లక్షల ఆదాయంసమకూరింది.సూర్యాపేట జిల్లాలో 99 మద్యం దుకాణాలకు 4154 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.83 కోట్ల 8 లక్షల ఆదాయం చేరింది.యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District )లో 82 మద్యం దుకాణాలకు గతంలో దానికి రెట్టింపుకు అదనంగా 3969 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.79 కోట్ల 38 లక్షల ఆదాయం లభించింది.ఇంత భారీ మొత్తంలో దరఖాస్తులు రావడానికి రాజకీయ నేతలే సిండికేట్ గా మారి పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసినట్లు తెలుస్తుంది.