ఏడుగురు శిశువులను చంపేసిన కిరాతకురాలు.. ఆమెను పట్టించిన ఎన్నారై డాక్టర్...

ఏడుగురు శిశువులను చంపి, మరో 6 మందిని చంపడానికి ప్రయత్నించిందో బ్రిటీష్ నర్సు.( British Nurse ) ఈమె చేసిన నేరాలకు రుజువులను అందిస్తూ ఆమెను దోషిగా నిర్ధారించడంలో ఒక ఎన్నారై వైద్యుడు( Nri Doctor ) సహాయం చేశారు.

 Indian-origin Doctor Helps Catch Nurse Guilty Of Killing Babies In Uk Details, E-TeluguStop.com

యూకేలో జన్మించిన ఈ భారతీయ సంతతికి చెందిన డాక్టర్ వల్ల చాలామంది పిల్లలు చావు నుంచి తప్పించుకోగలిగారు.హంతకురాలిగా తేలిన లూసీ లెట్బీ ( Lucy Letby ) అనే నర్సు ఇంగ్లాండ్‌లోని చెస్టర్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్‌లో పనిచేసింది.

Telugu Baby, British Nurse, Ravi Jayaram, England Nurse, Ward, Nri, Paediatricia

అనేక మంది శిశువులు( Babies ) చనిపోవడం లేదా కుప్పకూలడంతో తాను, ఇతర వైద్యులు ఎంతో ఆందోళన చెందినట్లు ఎన్నారై పీడియాట్రీషియన్ డాక్టర్ రవి జయరామ్( Dr.Ravi Jayaram ) తెలిపారు.లెట్బీ ఈ దారుణాలకు పాల్పడుతుందని వారు హాస్పటల్ యాజమాన్యం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు.అయితే, డాక్టర్లు ఈ విషయమై ఒక పోలీసు అధికారికి ఫిర్యాదు చేసేందుకు అనుమతి ఇవ్వడానికి యాజమాన్యం ఏకంగా రెండేళ్ల సమయం తీసుకుంది.ఆ తర్వాత దర్యాప్తును పోలీసు అధికారులు చేపట్టారు.2018లో లెట్బీని అరెస్టు చేశారు.ఆమె 2023లో హత్య, హత్యాయత్నానికి పాల్పడినట్లు తేలింది.

Telugu Baby, British Nurse, Ravi Jayaram, England Nurse, Ward, Nri, Paediatricia

పిల్లలపై దాడి చేయడానికి లెట్బీ గాలి, ఇన్సులిన్‌తో ఇంజెక్ట్ చేయడం, వారికి పాలు లేదా ద్రవాలను బలవంతంగా తినిపించడం వంటి అనేక పద్ధతులను ఉపయోగించినట్లు కోర్టు గుర్తించింది.ఆమె కొంతమంది శిశువులకు ఇంపాక్ట్-టైప్ ట్రామా కూడా కలిగించింది.లెట్బీ చేతితో రాసిన నోట్స్‌ను కూడా పోలీస్ టీమ్‌ కోర్టులో సమర్పించింది.

ఈ నోట్స్‌లో ఆమె తన చర్యల గురించి తెలుసుకుని, వాటి పట్ల అపరాధ భావంతో ఉన్నట్లు పేర్కొంది.హత్యాయత్నానికి సంబంధించి మరో ఆరు ఆరోపణలపై జ్యూరీ తీర్పులు ఇవ్వలేకపోయింది.

ఏది ఏమైనా ఈ కిరాతక నర్సుకు సోమవారం శిక్ష ఖరారు చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube