ఈ మూడు చాలు.. ఎంతటి హెయిర్ ఫాల్ ను అయినా ఇట్టే అరికడతాయి!

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి, పలు రకాల మందుల వాడకం, పెరిగిన కాలుష్యం, జీవనశైలిలో మార్పులు, ధూమపానం, మద్యపానం తదితర కారణాల వల్ల స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మంది హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా నలిగిపోతున్నారు.ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్ సమస్యను వదిలించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

 A Remedy For Severe Hair Fall Is Here! Home Remedy, Latest News, Stop Hair Fall,-TeluguStop.com

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇకపై హెయిర్ ఫాల్ సమస్యతో వర్రీ అవ్వకండి.

ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే మూడు పదార్థాలు చాలు.ఎంతటి హెయిర్ ఫాల్ ను అయినా ఇట్టే అరికడతాయి.మరి ఇంతకీ ఆ మూడు పదార్థాలు ఏంటి.వాటిని ఎలా జుట్టుకు ఉపయోగించాలి.

అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక అలోవెరా ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Aloe Vera, Care, Care Tips, Fall, Remedy, Latest, Mud Oil-Telugu Health

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనెను వేసుకోవాలి.అలాగే నాలుగు చుక్కలు రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ ను వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు క‌దుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Aloe Vera, Care, Care Tips, Fall, Remedy, Latest, Mud Oil-Telugu Health

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే కలబంద ఆవనూనె మరియు రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ లో ఉండే ప్రత్యేక సుగుణాలు జుట్టు కుదుళ్ళను దృఢంగా మారుస్తాయి.హెయిర్ ఫాల్ సమస్యను అరికడతాయి.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల డ్రై హెయిర్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా మెరుస్తుంది.చుండ్రు సమస్యను నివారించడానికి సైతం ఈ రెమెడీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube