ఈ మూడు చాలు.. ఎంతటి హెయిర్ ఫాల్ ను అయినా ఇట్టే అరికడతాయి!

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి, పలు రకాల మందుల వాడకం, పెరిగిన కాలుష్యం, జీవనశైలిలో మార్పులు, ధూమపానం, మద్యపానం తదితర కారణాల వల్ల స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మంది హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా నలిగిపోతున్నారు.

ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్ సమస్యను వదిలించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇకపై హెయిర్ ఫాల్ సమస్యతో వర్రీ అవ్వకండి.

ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే మూడు పదార్థాలు చాలు.ఎంతటి హెయిర్ ఫాల్ ను అయినా ఇట్టే అరికడతాయి.

మరి ఇంతకీ ఆ మూడు పదార్థాలు ఏంటి.వాటిని ఎలా జుట్టుకు ఉపయోగించాలి.

అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక అలోవెరా ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. """/"/ ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనెను వేసుకోవాలి.అలాగే నాలుగు చుక్కలు రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ ను వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు క‌దుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

"""/"/ వారానికి రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే కలబంద ఆవనూనె మరియు రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ లో ఉండే ప్రత్యేక సుగుణాలు జుట్టు కుదుళ్ళను దృఢంగా మారుస్తాయి.

హెయిర్ ఫాల్ సమస్యను అరికడతాయి.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల డ్రై హెయిర్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా మెరుస్తుంది.చుండ్రు సమస్యను నివారించడానికి సైతం ఈ రెమెడీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

రైలు ప్రయాణాలలో జరభద్రం సుమీ.. లేకపోతే సమస్యలు తప్పవు!(వీడియో)