మన భారతదేశంలో చాలామంది ఇళ్లలో దేవునికి ప్రత్యేకమైన పూజ మందిరం( Pooja Romm ) ఖచ్చితంగా ఉంటుంది.అయితే ఇది ఏ దిశలో ఉండాలి? అసలు వాస్తు ప్రకారం దేవుని మందిరాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని మన వాస్తు శాస్త్రంలో కచ్చితంగా చెబుతున్నారు.దాని గురించి చెప్పాలంటే మందిరాన్ని సరైన దిశలో ఉంచి దైవాన్ని పూజించినట్లయితే ఆ గృహంలోని వారికి ఆరోగ్యం, సంపద, ఆనందం తప్పకుండా కలుగుతాయని వాస్తు శాస్త్రం నిపుణులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే ఇంటికి ఈశాన్య దిశ వాస్తు శాస్త్రం( Vastu Shastra )లో అదృష్టంగా పరిగణిస్తారు.పూజ మందిరాన్ని ఉంచడానికి ఇది ఒక మంచి దిశా అని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఉదయించే సూర్యునికి ఇంద్రునికి దిక్కు కనుక తూర్పు ముఖంగా ప్రార్థించడం అదృష్టం, పురోగతిని తెస్తుంది.
ఇంకా అలాగే పడమటి వైపు మొహం పెట్టడం వల్ల డబ్బును ఆకర్షించవచ్చు.అంతేకాకుండా సానుకూల శక్తిని ఆకర్షించడానికి ప్రార్థిస్తున్నప్పుడు ఉత్తర దిశ కూడా ఎంతో మంచిది.పూజ చేసేటప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణం వైపు( South Direction ) చూడమని సలహా ఇవ్వలేదు.అనుకూల పరిణామాలను నివారించడానికి మందిరాన్ని దక్షిణ దిశలో ఉంచడం మానుకోవాలి.
పూజ గదిలో విగ్రహాలను( Idols in Pooja Room ) ఉంచేటప్పుడు ఇలాంటి విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.ప్రతికూల ప్రభావాలను కలిగించే విధంగా విగ్రహాలను నేలపై ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.ఎప్పుడూ కూడా దేవత విగ్రహాలు, పటాలను ఎత్తైన పీఠంపై ఉంచాలి.విగ్రహాల ముఖాన్ని పులమాలలతో కప్పకూడదు.ఇంట్లో పెద్ద దేవత విగ్రహాలను ఉంచకూడదు.ఎందుకంటే ఇది అశుభమైనది.
ముఖ్యంగా చెప్పాలంటే విగ్రహం పరిమాణం తప్పనిసరిగా ఏడు అంగుళాల లోపే ఉండాలి.అంతే కాకుండా పూజ గదిలో బోలుగా ఉన్న దేవత విగ్రహాలను అస్సలు ఉంచకూడదు.
కళగా ఉన్న దేవత విగ్రహాలను మాత్రమే ఉంచాలి.
LATEST NEWS - TELUGU