ముఖ్యంగా చెప్పాలంటే ఆదివారానికి హిందూ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఎందుకంటే ఈ రోజు సూర్య భగవానుడికి ( Lord Surya )అత్యంత ఇష్టమైన రోజు అని పండితులు( Scholars ) చెబుతున్నారు.
సాంప్రదాయం ప్రకారం ఆదివారం రోజు ఈ పనులు అస్సలు చేయకూడదు.చేస్తే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఆదివారం కొన్ని పనులను అస్సలు చేయకూడదు.ఈ రోజున అటువంటి పనులు చేయడం వల్ల సూర్య భగవానుని ఆగ్రహానికి గురి అవుతారు.
ఆదివారం రోజు ఎలాంటి పనులు చేయకూడదు.సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం ఆదివారాలలో మీరు నలుపు, నీలం లేదా బూడిద రంగు దుస్తులను ధరించకూడదు.ఆదివారాన్ని సూర్య భగవానుని రోజుగా పరిగణిస్తారు.కాబట్టి ఈ రోజున గులాబీ, బంగారు, నారింజ మరియు ఎరుపు రంగు దుస్తులను ధరించడం వల్ల జీవితంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.అలాగే ఆదివారం రోజు జుట్టు, గోర్లు, కత్తిరించకూడదని పండితులు చెబుతున్నారు.
అలాగే ఆవా నూనె జుట్టుకు మసాజ్ చేయడం కూడా అరిష్టానికి దారితీస్తుంది అని చెబుతున్నారు.ఆదివారం రోజు పొరపాటున కూడా మాంసం, చేపలు, మద్యం తీసుకోకూడదు.
అలా చేయడం వల్ల సూర్యభగవానుడి ఆగ్రహానికి గురవుతారు.

అలాగే ఈ రోజున ఎరుపు రంగులో ఉండే కాయగూరలు బచ్చలికూర, వెల్లుల్లి మరియు ఉల్లిపాయలకు కూడా దూరంగా ఉండాలి.రాగికి వాస్తు దోషాలను( Vastu Doshas ) పోగొట్టే శక్తి ఉంది.ఇది మీ ఇంటి వాతావరణన్ని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
మీకు కీర్తి ప్రతిష్టలను తీసుకొస్తుంది.అందుకని ఆదివారం రోజు రాగి వస్తువులను మార్పిడి చేయకూడదు.
రాగితో తయారు చేసిన వస్తువులను ఆదివారాలలో కొనకూడదు.అలాగే అమ్మకూడదు.
సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఆదివారం ఉపవాసం ఉండాలి.సూర్యోదయం సమయంలో గాయత్రీ మంత్రం( Gayatri Mantra ) పాటించి సూర్యునికి నీరు సమర్పించాలి.
ఆదివారం నుంచి ప్రతి రోజు 108 సార్లు సూర్య మంత్రాన్ని జపించాలి.అలాగే ప్రతి రోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేయాలి.
అలాగే ఉదయం పూట నీళ్లు తాగడానికి రాగి పాత్రను ఉపయోగించాలి.ఈ విధంగా చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందవచ్చు.