60 లోనూ యవ్వనంగా మెరిసి పోవడానికి ఇవి రెండు చాలు.. తెలుసా?

వయసు అనేది ఆగమన్న ఆగదు.వయసు పెరిగేకొద్దీ యవ్వనం తరిగిపోతుంటుంది.

 These Two Ingredients Can Help You Look Young Even At 60! Two Ingredients, Cocon-TeluguStop.com

ముఖంపై ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య లక్షణాలు కొట్టొచ్చినట్లు కనబడుతుంటాయి.అయితే కొందరు మాత్రం వయసు పైబడిన సరే చాలా యవ్వనంగా కనిపిస్తుంటారు.

అలాంటి వారిని చూస్తే కాస్త అసూయ కలగడం సహజమే.కానీ మీరు కూడా 60 లోనూ యవ్వనంగా మెరిసిపోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే రెండు పదార్థాలు అద్భుతంగా సహాయపడతాయి.మరి ఆ రెండు పదార్థాలు ఏంటి.

వాటిని ఎలా ఉపయోగించాలి.అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి పాలు( Coconut milk ).వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.కొబ్బరి పాలు రుచిగా ఉండడమే కాదు ఎన్నో విలువైన పోషకాలను కలిగి ఉంటాయి.కొబ్బరి పాలు డైట్ లో ఉంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.అలాగే చర్మ సౌందర్యానికి కూడా కొబ్బరి పాలు ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో చర్మ సమస్యలకు కొబ్బరి పాలతో అడ్డుకట్ట వేయొచ్చు.

ఇక మరొక ఇంగ్రిడియంట్ అలోవెరా జెల్.సౌందర్య సాధనలో దీన్ని విరివిరిగా వాడుతుంటారు.

Telugu Aloe Vera Gel, Tips, Coconut Milk, Latest, Skin Care, Skin Care Tips, You

అయితే ఈ రెండు పదార్థాలతోనే మన యవ్వనాన్ని కాపాడుకోవచ్చు.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ( Aloe Vera Gel ))వేసుకోవాలిజ‌ అలాగే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కొబ్బరి పాలు వేసుకుని స్పూన్‌ సహాయంతో ఒక ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేయాలి.తద్వారా స్మూత్ క్రీమ్ సిద్ధమవుతుంది.ఈ క్రీమ్ ను బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

Telugu Aloe Vera Gel, Tips, Coconut Milk, Latest, Skin Care, Skin Care Tips, You

ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసి కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా ప్రతిరోజు కనుక చేస్తే చర్మం యవ్వనంగా మెరుస్తుంది.

ముడతలు చారలు వంటి వృద్ధాప్య లక్షణాలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.చర్మం టైట్ గా మారుతుంది.

అలాగే ఈ న్యాచురల్ క్రీమ్ ను వాడటం వల్ల చర్మం సూపర్ గ్లోయింగ్ గా మెరుస్తుంది.షైనీ స్మూత్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

మరియు మొండి మచ్చలు ఏమైనా ఉన్నా సరే తొలగిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube